హోలీ....!! (నానీలు)
- కె.ఎల్.వి.
- May 5, 2021
- 1 min read
రంగులు చల్లి -
చెయ్యిచాపితే ,
సిగ్గుతో వసంతం
తలదించుకుంది !!
-------------------------
ప్రేమలూ -
అభిమానాలూ లేవు!
రంగులతో కుమ్ము కున్నయ్,
రాక్షస ముఖాలు....!!
-------------------------------‐--
హోలీ రంగు-
ఆమె ఎదపై చిమ్మిన్ది!
అప్పటికే ఆమె -
అతనిదయింది ...!!
------------------------------------
ఆనందం-
పెన్చేది కావాలి 'హోలీ'
విషాదాన్ని పంచేది
కాకూడదు ఈ కేళి..!!
------------------------------------
_డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,
హనంకొండ .
留言