కథలు,కవితలు,వ్యాసాలు, వీడియోలకు ఇది నిలయం కావాలి

నేను- నా సాహితీ ప్రస్తానం
కె.ఎల్వీ గా పిలవబడే నా పూర్తి పేరు డా.కె. ఎల్.వి. ప్రసాద్.వృత్తి రీత్యా దంతవైద్యుడిని ,ప్రవృతి రీత్యా,రచయితను(కథలు,కవిత్వం ,వ్యాసం వగైరా)పుట్టింది,పెరిగింది,తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం.తల్లి స్వర్గీయ కానేటివెంకమ్మ,తండ్రి స్వర్గీయ కానేటితాతయ్య.
హైస్కూల్ విద్య పాక్షికంగా,అప్పటి తాలూకా కేంద్రం,రాజోలులో.తదుపరి విద్య నాగార్జునసాగర్,హైదరాబాద్ లలో.పెద్దన్నయ్య స్వర్గీయ కె.కె .మీనన్ స్వయంగా కథ/నవలా రచయిత కావడంవల్ల ,చిన్న వయసులోనే ,గొప్ప రచయితల సాహిత్యం చదువుకునే అవకాశం కలిగింది .
ఇంటర్ మీడియేట్ లో ఉండగానే కవిత్వం రాయడం మొదలు పెట్టాను.1975 నుండి దంత వైద్య విజ్ఞాన వ్యాసాలు రాస్తున్నాను.1983 నుండి కథలు రాయడం మొదలైంది.ఉద్యోగ రీత్యా వరంగల్ జిల్లా,హన్మకొండలో స్థిరపడ్డాను .వరంగల్ ‘సహృదయ ,సాహిత్య ,సాంస్కృతిక సంస్థ‘ కు ,వరుసగా 13 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేసాను . 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా, పదవీ విరమణ చేసాను.
నేను రాసిన పుస్తకాలు
కథా సంపుటాలు:
1)కె . ఎల్వీ . కథలు
2)అస్త్రం (చిన్నకథలు )
3)హగ్ మీ క్విక్
4)విషాద మహానీయం (స్మృతి గాథ )
కవితలు:
1)పనస తొనలు
2)చిలక పలుకులు
దంత వైద్య విజ్ఞానం:
1)పిప్పి పన్ను చికిత్స
2)దంతాలూ -ఆరోగ్యం
3)చిన్న పిల్లలు దంతసమస్యలు
సంచిక, మొలక అంతర్జాల పత్రికలలో కవితలు ,వ్యాసాలూ రాస్తున్నాను .