విన్నారా ఇది ,
ఉహించని సంగతి ,
తెలుసుకున్నా ...
అవసరాన్ని _
విడువ లేని పధ్ధతి !
క్షౌరశాలలనుండే
కరోన వైరస్...
కదలి వస్తున్దట
మనకూడా.....
ఊహించనంత ,
సులభంగా !
మన ముక్కు
మూడుసార్లైనా ,
రుద్దకుండా _
వదులుతాడా ,
మనకి కప్పే గుడ్డతో !
మనకంటే ముందు ,
ఎన్నిముక్కులు ...
తాకివుంటుందో ,
ఆ ..పాడుగుడ్డ !
అప్రమత్తం ...!
జనులారా....
అప్రమత్తం....!
కనిపెట్టుకుని ఉండండి ,
ఈ ....
క్షౌరశాలల వ్యవహారం,!
కరోనా మహమ్మారి..
మనతో....
కలసి వ చ్చే వ్యూహం...!!
-----డా.కె.ఎల్.వి.ప్రసాద్,
హన్మ కొండ.
Comentários