"బాబూ ..
బాగా చదువుకోవాలి "
నాచిన్నప్పుడు
ఇది అమ్మ ఆశీర్వాదం !
అమ్మ
పూర్తి నిరక్ష్య రాసురాలు ,
అయినా
తన పిల్లలు
పెద్ద చదువులు
చదువుకోవాలన్నది
అమ్మ అకాంక్ష !
పేద రికాన్ని
జయించడంలోనూ ,
పిల్లల ఆకలి మంటలు ,
తీర్చడంలోనూ
అమ్మ బహునేర్పరి !
ఆమె తెలివి
సమయస్ఫూర్తి ,
అక్షరాస్యుల్లో కూడా ,
కన్పించనంతటిది !
అమ్మ కొర్కెను
అక్కలు
అన్నదమ్ములం
అందరం ...
తీర్చగలిగాం ..
సమాజంలొ
ఉన్నతులుగా
నిలబడగలిగాం !
కానీ ..
మా అభివృద్దిని
ఆవిడ ఆకాంక్షలను
వీక్షించే అవకాశం
అమ్మకు లేకుండా..
పోయింది!!
ఈ రోజున నేను
పండు తిన్నా
ఫలహారం తిన్నా..
కారులో తిరిగినా
విమానంలో
ప్రయాణించినా,
కొత్త బట్టలు వేసుకున్నా.
పదిమంది తో కలసి
కుటుంబ వేడుకల్లో
పాల్గోన్నా....
ప్రతిరోజు
ఏదో సందర్భంలో
అమ్మ గుర్తొస్తూనే ఉంటుంది!
పిల్లల్ని అధికుల్ని చేసి
తాను..
పేదరాలిగానే
వెళ్ళిపోయింది!
అందుకే..
ఈ ప్రత్యేక దినాన
మీ అందరి సమక్షాన
అమ్మను
ప్రత్యేకంగా
గుర్తు చేసుకుంటున్నాను.
అందరికీ..
మాతృదినోత్సవ
శుభాకాంక్షలు
అమ్మలందరికీ
పాదాభివందనం!!
----డా.కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ .
Comments