అమ్మ అంటేనే
ప్రేమ కు అర్థం
తెలిసివస్తుంది !
అమ్మ అంటేనే ...
ఆత్మీయత ---
అనురాగాల ,
బంధం అర్థమవుతుంది !
అమ్మ అంటేనే ...
విశ్రాంతి దొరకని
శ్రమ గుర్తుకొస్తుంది !
అమ్మఅంటేనే ...
అలకలను
అర్థం చేసుకునే ,
మనసు గుర్తుకొస్తుంది !
అమ్మఅంటేనే ...
స్వార్థంతెలీని
త్యాగం గుర్తుకొస్తుంది !
అమ్మఅంటేనే ...
ఒక రక్షణ కవచం
గుర్తుకొస్తుంది ....!
నా సుఖ -దుఃక్కాలలో ,
నాకెప్పుడూ ....
అమ్మేగుర్తుకొస్తుంది ,
అమ్మ లేనితనం
గుర్తుకు వస్తుంటుంది ..!!
*
----డా.కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ .
Comments