వెన్నెల ..వెన్నెల ,
చల్లటి ...
వెలుగుల వెన్నెల !
చంద్రబింబం
పూర్తిరూపం తో ,
పౌర్ణమి నాటి
వెన్నెల ......!
విచ్చుకున్న
పుచ్చపువ్వులాంటి
తెల్లని చల్లని వెన్నెల !
చీకటి రాత్రిని
పట్టపగలు చేసి ,
కనువిందు చేసే ...
చక్కని కమ్మని వెన్నెల !
పల్లెల్లో ని...
వెన్నెల స్నానాలు ,
గుర్తుకొస్తే....
పట్టణాలలో కురిసి న ,
వెన్నెల చల్లదనం ,
ఆస్వాదించలేని దురదృష్టం
దుఃఖం తెప్పిస్తుంది ....!!
----డా.కె.ఎల్.వి.ప్రసాద్,
హన్మ కొండ.
コメント