వైద్యానికందని ' జాడ్యం ' !! (కవిత)
- కె.ఎల్.వి.
- May 3, 2021
- 1 min read
కరోనా అంటే
భయంలేదునాకు ,
నాజాగ్రతలో నేనున్నాను !
కరోనాను
జయించగలననే
పూర్తినమ్మకం నాకుంది !
నామనసు వికలం అవుతుంది
కొందరి క విత్వం చదూతుంటే ,
ఊపిరాడని బాధ ,
ఉద్రేకం సడలని వ్యధ ,
వళ్ళంతా సలపరం ...
మానసికంగా -
కృంగిపోతున్న భావన ,
వాక్సిన్ కందని రోగం !
దీన్ని జయించడం
బహు కష్టం ......
అలా అని సర్దుకుపోలేని ,
చిత్రమైన జాడ్యం .....!!
--------డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,
హన్మ కొండ .
Comments