నా శ్రీమతి పుట్టిల్లు విజయవాడ.
అందుచేత ,విజయవాడలో ఉన్నప్పుడు
ఆకాశవాణి ,విజయవాడ ,కేంద్రానికి ఒక
వ్యాసం రాసి పంపాను.వాళ్లు నాకు తప్పక
ప్రొగ్రాం ఇస్తారనే నమ్మకం తో అది పం ప ..
లేదు .ఒక ప్రయోగం చేద్దామనే ఉద్దేశ్యం
అంతే !పైగా విజయవాడ రేడియోకేంద్రం
చూడవచ్చునన్న ఉబలాటం.నేను రాసిన
వ్యాసం 'ఆర్థొ డాంటిక్స్ '(ఎత్తు పళ్ళను సరి
చేసె ,క్లిప్పుల వైద్యం )అప్పటికి ఆ..చికిత్స
అంత ప్రాచుర్యానికి రాలేదు.పైగా దంత ...
సంభంద అంశం కాబట్టి ,ఆకాశవాణి లో
ఈ సెక్షన్ లో పని చేసె అదికారులకు పెద్ద
అవగాహన ఉండదు .అందుచేత అలంటి
ప్రసంగ వ్యాసాలు తీసుకోడం అరుదు .అలా
అనుకున్నట్టుగానే జరిగింది .చాలా భద్రం
గా ,వెన్నక్కి తిరిగి వచ్చింది.రేడియో వాళ్ల
దగ్గర ముందస్తుగానే తయారు చేసుకున్న
'రిజెక్టెడ్ ఫామ్ 'ఉంటుంది .అందులో ఏమి
ఉంటుందంటే ,"మీ వ్యాసం అందింది .మీ
రచన బాగున్నప్పటికీ ,మేము ఉపయాగించ
లేకపోతున్నందుకు చింతిస్తున్నాం "అని
ఉంటుంది.ఆ కాగితం తగిలించుకుని తిరిగి
వచ్చింది నా వ్యాసం.అసలు అది చదవ ..
కుండానే తిప్పి పంపినట్టు నాకు అనుమానం వచ్చింది.వెంటనే స్టేషన్ ....
డైరెక్టర్ గారికి ఒక ఉత్తరం రాశాను.నా వ్యాసం ఎందుకు నచ్చలేదో ,ఏమి తప్పులు
ఉన్నాయో ,ఎందుకు తిప్పిపంపారో తెలియ
జేయాలని,వారం రోజుల్లో మీ నుండి సమాదానం రాకుంటే,విశయం ఉన్నత అది
కారుల దృష్టికి తీసుకు పోతానని నా
ఉత్తరం సారాంశం.నా ఉత్తరం అందింది .
పది రోజుల కు ,నా ఉత్తరానికి జవాబు కు
బదులు ప్రొగ్రాం కాంట్రాక్ట్ వచ్చింది .వారు
రికార్డింగుకు పిలిచిన తేదీ కి వెళ్లాను .
అక్కడ ప్రొగ్రాం ఎగ్జికుటివ్ ,మహిళామణి
ఉన్నారు .నా స్క్రిప్టును తిప్పి పంపింది
ఆవిడే !నేను వెళ్ళగానే మరోమాటకు తావు
లెకుండా,రికార్డు చెసారు.నేను కూడా
గతాన్ని తవ్వకుండా,వారు ఇచ్చిన పారి ..
తోషికం చెక్కు తీసుకుని మర్యాదగా బయట పడ్డాను.ఇది తలుచుకున్నప్పుడు
ఒకపక్క నవ్వు ,మరోపక్క ,ఆశ్చర్యం కుడా
అనిపిస్తుంది.తరువాత ,గౌ .బాబూరావు
గారు ,గౌ .మహమూద్ ఆలీ (ఆంగ్లం) గారు
పిలిచి ప్రొగ్రాం లు ఇచ్చారు .ఇది మరిచి
పొలేని ,మధుర (చిలిపి )ఘట్టం !!
* * *
-----డా.కె.ఎల్.వి.ప్రసాద్,
హన్మ కొండ.
Comments