నేను మహబూబాబాద్ ప్రభుత్వ
ఆసుపత్రిలొ ,పనిచేస్తున్న కాలంలో ,అంటే
1982_1994,మద్య కాలం లో ,ఆకాశవాణి
హైదరాబాద్ ,కేంద్రానికి స్త్రీల దంత సమస్య
లకు సంబంధించి ,ఒక ప్రసంగ వ్యాసం
పంపించాను.అప్పటిలో ఆ విభాగం స్వర్గీయ శ్రీమతి .తురగా జానికీ రాణి గారు
చూస్తున్నారు .ఎవరు చూస్తున్నారో అన్న
విశయం తో సంభందం లేకుండానే స్టేషన్
డైరెక్టర్ గారి పేరు మీద వ్యాసం పంపించాను
అయితే ,నేను పంపిన వ్యాసం వారం రోజుల్లో ,నా అడ్రసుకు తిరిగి వచ్చింది.ఐతే
కొన్ని మార్పులు చేసి పంపామన్నారు .అది
గ్రామీణ స్త్రీల కార్యక్రమం.వాళ్లకు అర్దం అయ్యె స్తాయిలో రాయమని చెప్పారు .
అలాగే రాసి వెంటనే పంపించాను.మళ్ళీ
వారం రోజులకి ,నా వ్యాసం యధావిధిగా
తిరిగి వచ్చింది.ఈ సారి గ్రామీణ స్త్రీలకు
అర్దమయ్యే భాషలో రాయమని ,ఆ ...
తిరుగ టపా తాత్పర్యం .మళ్లీ వారి
సూచనల మేరకు వ్యాసం తిరగ రాసి
పంపించాను.రేడియో కోసం ఇంత కష్టం
ఎప్పుడూ పడలేదు .పంతానికి రాయ వలసి
వచ్చింది.తరవాత పదిహేను రోజులకు
నాకు ,ఆకాశవాణి నుంచి రికార్డింగ్ డేట్
పీక్స్ చేసి ,కాంటాక్ట్ పేపర్స్ పంపించారు .
వెంటనే ,రిప్లై షీట్ మీద సంతకం చేసి
ఆకాశ వాణి కి.వాళ్లు నిర్ణయించిన తేదీ
ప్రకారం రికార్డింగ్ కొసం మహబుబాబాద్
నుండి హైదారాబాద్ కు వెళ్లాను.మొదటి
సారి తురగా జానికీ రాణి గారిని ప్రత్యక్షంగా
చూసే అవకాశం కలిగింది.ఆవిడ మంచి
ఆఫీసరు మత్రమే కాదు ,మంచి రచయిత్రి
కూడా .ఆవిడ దగ్గర ఉండి రికార్డింగ్ పూర్తి
చేయించి ,"మొత్తం మీద సాధించారు డాక్టర్
..అని ,ప్రశంసించారు.అలాంటి గొప్ప పెక్స్
లు ,అప్పుడు మార్గ దర్శనం చేయడం వల్ల
నాటి నుండి నేటి వరకు మంచి బ్రాడ్ కాస్టర్
గా ,రేడియా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామన్న తృప్తి మిగిలింది.
*
-----డా.కె.ఎల్.వి.ప్రసాద్,
హన్మ కొండ.
Comments