నాజీవితం ఒక కుదుపుతో మలుపుతిరిగి ఈ
రోజున ఇలా మీమధ్యన ,ఒక దంతవైద్యుడిగా ,
కవిగా,కథా రచయితగా ,వ్యాసకర్తగా ,వున్డడానికి
నలుగురు ప్రధాన వ్యక్తులు వున్నారు.
నేను అనారోగ్య పరి స్తితికి గురిఅయినప్పుడు తన
అపారమైన సేవలు అందిన్చి నాకు పునర్జన్మ కల్పిన్చి
నవాడు,ప్రముఖ రచయిత,నా పెద్దన్నయ్య స్వర్గీయ
శ్రీ కె.కె.మీనన్.
అనారోగ్యం నున్డి బయటప డి,మెట్రిక్యులేషన్
పాస్ అయిన తర్వాత,నాగార్జున సాగర్ లో తన
దగ్గర వున్చుకుని ,ఇన్టర్మీడియేట్ చదివిస్తూ,
నా జీవితానికి,క్రమ శిక్షణతో కూడిన దిశానిర్దేశం
చేసిన నా పెద్దక్క స్వర్గీయ కుమారి కానేటి ....
మహానీయమ్మ.
నేను అనారోగ్యంతో వున్న ప్ఫుడు,నా భవిష్యత్తు
విషయంలో, నాకు ధైర్యం చెబుతూ,వృత్తి విద్యగా
దంత వైద్యం,ప్రత్యేకతను అవగాహన కల్పిన్చిన
చిన్నన్నయ్య డా.మధుసూదన్.కానేటి(ఆకాశవాణి)
నా ...ఉద్యోగ పర్వంలో ..తొలి అడుగు వేయించి ,నా ..భవిష్యత్తుకు పునాది రాయివేసిన
మహా నుభా వులు ,సహృదయులు, గురువులు
ప్రొఫెసరు పి.రామచంద్రా రెడ్డిగారికి నేను ఎప్పుడు
రుణపడి ఉంటా ను.వీరందరికీ హృదయ పూర్వక
కృతఙ్ఞతలు.
----డా.కె.ఎల్.వి.ప్రసాద్,
హన్మకొండ .
Comments