top of page
  • Writer's pictureకె.ఎల్.వి.

రేడియో తో ...#3 (అనుభవాలు ___జ్ఞాపకాలు ...వ్యాసం)

ఆకాశవాణి ,హైదరాబాద్ లో ,యువవాణి

కార్యక్రమాలతో ,నా రేడియో జీవితం

ప్రారంభమైంది .నన్ను రేడియో కి పరిచయం

చేసిన మితృడు డా .సత్యవోలు సుందర శాయి.ఇద్దరం బి.ఎస్ .సి .మొదటి సంవత్సరం కలిసి చదువుకున్నాము .అలా

ఇద్దరం మంచి స్నేహితులమయ్యాము . నేను అన్నయ్య దగ్గర శాంతి నగర్ లో ఉండే

వాడిని .మితృడు శాయి ,విజయనగర్

కాలనీ లో ,వాళ్ల బావగారు శ్రీ జీడిగుంట

రామ చంద్ర మూర్తి గారి ఇంటికి చాలా

దగ్గరలో ఉండేవారు .అక్కడే కీ శే.రావూరి

భరద్వాజ గారి ఇల్లుకూడా ఉండేది .శాయి

ద్వారా శ్రీ .జీడిగుంట, నాకు మంచి మిత్రు

లైనారు .

1975 లొ నేను బి.డి.ఎస్ లో జాయిన్

అయిన తరవాత ,శాయి ,యువవాణి లొ

ప్రొగ్రాం లు ఇప్పించే వాడు.అలా అప్పుడు

శ్రీ భీమయ్య నాకు పరిచయం అయ్యారు.

అయన తెలుగు యువవాణి పెక్స్ గా

ఉండేవారు .అయన ఒకసారి ఒక సవాల్

విసిరారు ."మీ దంత వైద్యులు ఎప్పుడు

పిప్పిపన్ను ,చిగురునొప్పి ,గురించే చెబుతారు ,అంతకు మించి డెంటిస్ట్రీ లో

ఇంకేమి లేదా "అన్నారు.నాకు కొంచెం ఆ ..

మాట ,చివుక్కు మనిపించింది.మీరు నాకు

చాన్సు ఇచ్చి చూడండి ,ఉందో ,లేదో

చెబుతానన్న .అయన ,ఆకాశ వాణి ,నియ

మ,నిబంధనలను సైతం ప్రక్కన పెట్టి నా చేత ,నెలకొక వ్యాసం రాయించి ,పది నెలల

తరవాత ,బాబూ ఇక చాలు ప్రస్తుతానికి ,

డెంటిస్ట్రీ అంటే ఏమిటో ఇప్పుడు అర్దం

అయింది ,అని మెచ్చుకున్నారు.అలా

స్క్రిప్టులు రాయడం బాగా అలవాటు అయింది.

మహానుభావుడు ,శ్రీ భీమయ్య ,వున్నారో ,

లేదో ,ఉంటే ఎక్కడ ఉన్నారో గాని ,బ్రతికి

నంతకాలం ,నేను ఆయనను తలచుకొని

క్షణం వుండదు ,అయన ప్రాత్సాహం ,మరి

అలాంటిది !

* * *


-----డా.కె.ఎల్.వి.ప్రసాద్,

హన్మ కొండ.

3 views0 comments

Recent Posts

See All

కృతఙ్ఞతలు...!! (చిరు వ్యాసం)

నాజీవితం ఒక కుదుపుతో మలుపుతిరిగి ఈ రోజున ఇలా మీమధ్యన ,ఒక దంతవైద్యుడిగా , కవిగా,కథా రచయితగా ,వ్యాసకర్తగా ,వున్డడానికి నలుగురు ప్రధాన వ్యక్తులు వున్నారు. నేను అనారోగ్య పరి స్తితికి గురిఅయినప్పుడు తన అప

రేడియో తో...... #2 (అనుభవాలు---జ్ఞాపకాలు.....వ్యాసం)

నేను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలొ ,పనిచేస్తున్న కాలంలో ,అంటే 1982_1994,మద్య కాలం లో ,ఆకాశవాణి హైదరాబాద్ ,కేంద్రానికి స్త్రీల దంత సమస్య లకు సంబంధించి ,ఒక ప్రసంగ వ్యాసం పంపించాను.అప్పటిలో ఆ విభాగం స్

" రేడియో ..తో.." (అనుభవాలు-- జ్ఞాపకాలు ---వ్యాసం )

నా శ్రీమతి పుట్టిల్లు విజయవాడ. అందుచేత ,విజయవాడలో ఉన్నప్పుడు ఆకాశవాణి ,విజయవాడ ,కేంద్రానికి ఒక వ్యాసం రాసి పంపాను.వాళ్లు నాకు తప్పక ప్రొగ్రాం ఇస్తారనే నమ్మకం తో అది పం ప .. లేదు .ఒక ప్రయోగం చేద్దామనే

Post: Blog2 Post
bottom of page