top of page
  • Writer's pictureకె.ఎల్.వి.

" యాసను ..శ్వాసగా .." (నాకు నచ్చిన కథ ------వ్యాసం)

మాతృభాష ‘తెలుగు ‘అయినా,రెండు తెలుగు భాషా రాష్ట్రాల్లోని మాట్లాడే 

భాష,యాస,మాండలిక పదజాలం ,మళ్ళీ ప్రాంతాన్ని బట్టి భిన్నంగాకని-

పిస్తాయి. వున్న ఊళ్ళోనే ఉద్యోగం చేయడం,పుట్టి పెరిగిన ఊళ్ళోనే,-

వియ్యమందడం,అనే అంశాలు అంత సుళువైనవి కావు,అలా ఆశించడం 

కూడా అత్యాశే అవుతుంది. పైగా అందరికీ సాధ్యమయ్యే పనికాదు.ఈ 

నేపథ్యంలో,ఒకప్రాంతంలోనే అనేక యాసలు ,మాటల్లో రాతల్లో అధికంగా 

మాండలిక ప్రభావం వున్నప్పుడు,కమ్యూనికేషన్ అనేది ప్రాధమిక దినాల్లో కొంచెం ఇరుపక్షాలకు ఇబ్బందిగానే ఉంటుంది. మనసుపెట్టి 

ప్రయత్నం చేస్తే,ఇలాంటి భాష /యాస ,సమస్యలకు పరిష్కారం కనుగొనడం అంత కష్టమైన పని కాదు ,అని తెలియజెప్పే ఒక అనుభవజ్ఞురాలయిన రచయిత్రి /కవయిత్రి ,తన అనుభవంలోనుంచి 

ఏరి ,పాఠకులకు అందించిన కథ ‘ఒకే తాను ముక్కలు’ఈ సంవత్సరంలో

నే,పాఠకుల ముందుకు వచ్చిన ‘ఇస్కూల్ కథలు ‘నుండి ,ఈ కథ స్వీక-

రింపబడింది. రచయిత్రిది విజయనగరం -రాజమండ్రి ,నేపధ్యం. అయితే 

భార్యా భర్తల ఉద్యోగ రీత్యా స్థిరపడింది హైదరాబాద్ లో. ఇది ఇప్పటి మాట కాదు,షుమారుగా 40-50,సంవత్సరాల క్రితంనాటి మాట. అప్పటి 

పరిస్థితుల్లో,ఒక ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేరినప్పుడు,

బడిపిల్లలనుండి,వారి తల్లి దండ్రులనుండి,ఎదురైన భాష /యాస ,కు 

సంభందించిన స్వీయ అనుభవాన్ని రచయిత్రి ఈ కథలో చాలా సరళంగా 

వివరినించారు. 


----------డా.కె.ఎల్.వి.ప్రసాద్,

హన్మ కొండ.

1 view0 comments

Recent Posts

See All

కృతఙ్ఞతలు...!! (చిరు వ్యాసం)

నాజీవితం ఒక కుదుపుతో మలుపుతిరిగి ఈ రోజున ఇలా మీమధ్యన ,ఒక దంతవైద్యుడిగా , కవిగా,కథా రచయితగా ,వ్యాసకర్తగా ,వున్డడానికి నలుగురు ప్రధాన వ్యక్తులు వున్నారు. నేను అనారోగ్య పరి స్తితికి గురిఅయినప్పుడు తన అప

రేడియో తో ...#3 (అనుభవాలు ___జ్ఞాపకాలు ...వ్యాసం)

ఆకాశవాణి ,హైదరాబాద్ లో ,యువవాణి కార్యక్రమాలతో ,నా రేడియో జీవితం ప్రారంభమైంది .నన్ను రేడియో కి పరిచయం చేసిన మితృడు డా .సత్యవోలు సుందర శాయి.ఇద్దరం బి.ఎస్ .సి .మొదటి సంవత్సరం కలిసి చదువుకున్నాము .అలా ఇద్

రేడియో తో...... #2 (అనుభవాలు---జ్ఞాపకాలు.....వ్యాసం)

నేను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలొ ,పనిచేస్తున్న కాలంలో ,అంటే 1982_1994,మద్య కాలం లో ,ఆకాశవాణి హైదరాబాద్ ,కేంద్రానికి స్త్రీల దంత సమస్య లకు సంబంధించి ,ఒక ప్రసంగ వ్యాసం పంపించాను.అప్పటిలో ఆ విభాగం స్

Post: Blog2 Post
bottom of page