-------------------------
జీవితానికే
పరీక్ష మొదలయింది
బ్రతికుంటే -
చదువు పరీక్ష !
-----------------------------
చదువు కొనసాగాలి
సమస్యలు తొలగి పోతే,
పరీక్షలా?
ఎప్పుడైనా.....!!
---------------------------------
కాలాన్ని కాటేసింది
కరోనా ......!
పరీక్షలకు అడ్డు కానీ,
చదువుకు కాదు ...!!
------------------------------------
పరీక్షల గురించి
భయం వద్దు...!
కరోనాను తరిమి-
కొట్టడమేముద్దు!!
--------------------------------------
సమస్యలు ఎదుర్కోవడం-
ఒక చాలెంజ్ ......!
చదువులో ఇదీ-
ఒకభాగమే ...!!
------------------------------------
పరీక్షలు ఉంటే ....
సిద్దంగా ఉండాలి ...!
వాయిదాపడితే ,
చదువే పని మరి !!
-------------------------------------
--డా.కె.ఎల్.వి.ప్రసాద్,
హన్మ కొండ .
Comments