రెండు చుక్కలమందు
పోలియో నివారణ
చుక్కలమందు ...
తరిమికొట్టునట
పోలియో జబ్బును !
అప్పుడే
పుట్టిన పాపనుండి
నావంటి
అయిదు వత్సరాల
పిల్లలవరకూ
ఈ చుక్కలమందు
తప్పనిసరి అట ..!
ఉచితంగా లభించు
ఈ చుక్కలమందు ను ,
నిర్లక్ష్యము చేయరాదు ,
తక్కువ అంచనా
వేయరాదు సుమా ...!
పిల్లలకు ...
అంగవైకల్యము తెచ్చి
బ్రతుకంతా .....
బాధామయము చేయు
మహమ్మారి
పోలియోక్రిమినాశనానికి
చుక్కలమందు కనుగొన్న
మహానుభావులకు
వందనం ....!
ఆమందును
ప్రతిబిడ్డకు చేర్చు
ఆరోగ్యకార్య కర్తలకు
పాదాభి వందనం ...!!
------డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,
హన్మకొండ .
Comments