నువ్వు
అక్కడ ఉన్నా ,
ఇక్కడ ఉన్నా ,
ఎక్కడ ఉన్నా ,
నీ సమస్య
సమస్యగానే
మిగిలిపొతుంది !
బంధుమిత్రుల
కోలాహాలమధ్య ,
పలకరింపుల ,
పులకింతల
పారవశ్యపు ,
అమూల్య
సమయంలో ,
బయటకు
తొంగిచూసే
వీలుండదు !
ఏకాంతంగా
తలుచుకునే
తరుణం రాదు !!
అందుకే ...
నీలో సహృదయత
నూటికి నూరుపాళ్లు
ఉన్నా .......
నీ సమస్య ఎప్పటికీ ,
నిన్ను ,
వెక్కిరిస్తూనే ఉంటుంది !!
*
---డా.కె.ఎల్.వి.ప్రసాద్,హన్మకొండ.
(మిత్రురాలు శ్రీమతి లక్ష్మీ పద్మజ .దుగ్గరాజు.
అమెరికా లో ఉన్నప్పుడు)
Commenti