top of page
  • Writer's pictureకె.ఎల్.వి.

" పుణ్య (జన్మ)భూమి " (కవిత)

అక్కడ .....నేలంతా ,

పచ్చని తివాచీ పరిచినట్టు

నిత్యం నిగ నిగ లాడుతుంటుంది,

పొలాలన్నీ ...

పచ్చని పైరుతో

ఉయ్యాల లూగుతుంటాయ్ !

కార్మిక ..కర్షకులతో,

కష్టించి పనిచేసే కూలీలతో,

కోడికూతతో పనిలేకుండానే ,

తెల్లవారుతుందక్కడ !


మెట్టభూములన్నీ ...

నారికేళ వృక్ష సముదాయంతో

జిరాఫీల్లా ..తల పైకెత్తి ,

ఆప్యాయంగా ..

పలకరిస్తుంటాయ్ .

జీవితాంతం ..

జీవన భృతిని

అందిస్తుంటాయ్ !


గోదావరి గట్టు ....

గ్రామాలను ..పొలాలను ,

విడదీసే ఏటిగట్టు ..కు,

ఇరువైపులా ...

గుబ్బ గొడుగుల్లాంటి చెట్లు,

బాడీ గార్డుల్లా ...నిలబడి,

బాటసారులకు

మార్గదర్శనం చేస్తుంటాయ్ !


కష్టపడడం ఎలాగో ..

కష్టించి ...

తృప్తిగా బ్రతకడం ఎలాగో ,

క్రమశిక్షణగా జీవించటం ఎలాగో ,

సహజంగా నేర్పుతుంది

ఈ ప్రదేశం !

ఇదే ...నా ఊరు

నను గన్న ఊరు ..

నను పెంచి ..పోషించిన ఊరు ,

'దిండి '...దాని పేరు ..!!


_డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,

హనంకొండ

1 view0 comments

Recent Posts

See All

అమ్మకు వందనం (కవిత)

"బాబూ .. బాగా చదువుకోవాలి " నాచిన్నప్పుడు ఇది అమ్మ ఆశీర్వాదం ! అమ్మ పూర్తి నిరక్ష్య రాసురాలు , అయినా తన పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలన్నది అమ్మ అకాంక్ష ! పేద రికాన్ని జయించడంలోనూ , పిల్లల ఆకలి మంట

విరుగుడు ....!! (కవిత)

ప్లాస్టిక్కా .... అదిగొప్ప ప్రమాదకారి కాదు ! ఫాక్టరీలు వెదజల్లే విషవాయువులా ? ఫరవాలేదు .... వాటిని -- నియంత్రించే , మార్గాలున్నాయి ! ఇంటర్నెట్ నుండి ఎత్తిపోసే కవిత్వం ... ఉందిచూసారూ ...అమ్మో, ఈ సాహిత్

ఏర్పాటు ..!! (కవిత)

వడివడిగా తిరిగే నీకాళ్లకు .... బంధం వేశాడు భగవంతుడు ! కరోనానుండి నిన్నుకాపాడడానికీ శ్రమించిన వంటికీ - మస్తిష్కానికీ , సేదదీర్చే ప్రయత్నంతో దేవదేవుడి ..... ఏర్పాటు ఇదినీకు ..!! ------డా.కె .ఎల్.వి.ప్రస

Post: Blog2 Post
bottom of page