పండుగలంటే ...
బాల్యాన్ని వెతుక్కుంటూ ,
వెనక్కి పరిగెత్తాలి ,
ఇంట్లో కనిపించని
పండగ వాతావరణం ,
బయట వెతుక్కున్న ,
గమ్మత్తు రోజులను
గుర్తు చేసుకోవాలి ,
ఇతరుల ఆనందంలోనించి ,
కొంతయినా గుంజుకుని ,
తృప్తి పడాలన్న ఆలోచనని
గుర్తు చేసుకుని ..
కాసేపైనా నవ్వుకోవాలి !
ఎప్పుడూ ...
గుర్తుండి పోయే ,
అతిముఖ్య మైన రోజు ,
దీపావళి ...!
బయట ..
రకరకాల కాంతులతో ,
గృహాలన్నీ ..
దేదీప్యమానంగా ..
వెలిగిపోతూంటే ,
మా ఇల్లు ..
గుడ్డి దీపాలతో
మబ్బు ..మబ్బు గా ,
కనిపించేది ...!
పేదరికం ..
వామపక్ష భావజాలం
చేయి ..చేయి కలుపుకుని ,
మా బాల్యాన్ని ,
వెక్కిరిస్తూ కనిపించేవి ,
దానికీ ..దీనికి ..
అర్థం తెలియని
మా పసి మనసులు ,
ఆ ..టపాకాయలవైపు ,
గురి పెట్టి చూసే వి ..
నిరాశ తో ..
నివాసాలకు మళ్ళేవి !
సంస్కృతి ..సంప్రదాయం
అని _కాదుగానీ ...
నా ..సమస్యను ,
నాపిల్లల దరిచేరనివ్వలేదు !
కానీ ...ఇప్పటికీ ..
దీపావళి వచ్చిందంటే ,
ఆ ..బాల్యమే గుర్తుకొస్తుంది ,
టపాకాయల సంబరం ..
క్రమంగా చల్లారిపోయింది ,!
అప్పుడు చూసి సంతోషించిందే ,
ఎంతో నయమనిపిస్తుంది !!
_డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,
హనంకొండ .
Comments