బయట తిరగాలని ఉంది
బంధువులను -
కలవాలని ఉంది ,
స్నేహితులతో -
గడపాలని ఉంది ,
క్షేమసమాచారం
తెలుసుకోవాలని ఉంది !
సభలు -సమావేశాలపై
విందులు -వినోదాలపై
మోజుపుడుతుంది ,
అశోకా హొటల్ కు వెళ్లి
వేడిగా ..వేడిగా---
కప్పు కాఁఫీ తాగాలని ఉంది !
ఎన్నికోర్కెలు ఉంటేనేమి
గేటుదగ్గర కాసుకొని వుంది
కరోనా మహమ్మారి !
గేటుదాటి
బయట అడుగు పెడితే
గుటుక్కున -
మింగేట్లుంది .....
అడ్రసు--
గల్లంతు చేసేట్లుంది !!
---డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,
హన్మకొండ .
Comments