నీకై ..నువ్వు ...!! (కవిత)
- కె.ఎల్.వి.
- May 5, 2021
- 1 min read
వంటరిగా
ఇంట్లోవుంటే
పండగలకు
పబ్బాలకు
లోటులేదు !
బయటికెళ్లి
మందిలో ...
మాస్కు లేకుండా
తిరిగితేనే ,
ఇబ్బందులకు
తెరలేపినట్టు ....!
మనమే కాకుండా ,
మందినికూడా
ఇబ్బందుల్లో -
ఇరికించినట్టు ...!
అనారోగ్యానికి
అవకాశం ఇచ్చినట్టు .!!
------డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,
హన్మకొండ .
Comments