వర్షాకాలంలో -
విరివిగాలభించి ,
నోరూరించే ,
నేరేడు పండ్లు
రుచిచూశారా
ఎప్పుడయినా ?
నల్లగా నిగనిగలాడే
' బ్లేక్ బెర్రీ'ని ...
చూశారా ...
ఎప్పుడయినా ?
పెద్దగా -
గుండ్రంగా ఉండేవి ,
కోలగా -
పెద్దగావుండేవి
అల్లనేరేడు పండ్లు
తెలుసామీకు ...?
చిన్నగా -గుండ్రంగ
వుండే ....
చిట్టినేరేడు పండ్లు
తెలుసా మీకు ...?
ప్రకృతి సిద్దంగా
లభించే ఈనేరేడు *
సంపూర్ణ....
ఆరోగ్య ప్రధాయిని
అని-తెలుసా మీకు?
నేరేడు పండు--
పోషకాల గని...అని,
రోగ నిరోధిని....అని,
తెలుసా....మీకు...?
నేరేడు పండు
తిని చూడండి,!
నోట్లో వేసు కుంటే ,
ఇట్టే ..కరిగిపోతుందండి !!
------డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,
హన్మకొండ .
コメント