బాల్యం
అమ్మతో గడిచిపొయింది
యవ్వనం చదువుతో
స్నేహితులతో కరిగిపొయి
వైవాహిక జీవితానికి
శ్రీకారం చుట్టి ....
ఉద్యోగపర్వం --
పిల్లలు -చదువులు -
వాళ్ళపెళ్ళిళ్ళు .....
ఆ ...తరువాత
సహచరుడిని కోల్పోయి ,
సకలబాధ్యతలు
స్వీకరించావు ....!
నడివయసు వచ్చింది ,
సంతాన సౌభాగ్య
సువాసనలు ఆస్వాదిస్తూ
భారత్-ఆష్ట్రేలియా-అమెరికా
తిరుగుతూ....
బ్రతుకుబాటను
త్రిభుజం చేసుకున్నావు.
కష్టంలోనే
అనందం
అనుభవిస్తున్నావు !
తల్లికి కూతురిగా ...
కూతుళ్లకు అమ్మగా
అల్లుళ్ళకు అత్తగా
మనవరాళ్లకు -
అమ్మమ్మగా .....
తెలుగుపాఠకులకు
ఇష్టమయిన -
రచయిత్రిగా .....
నీ ..జీవితం ధన్యం !
నీ ..స్నేహం -
నాకు అమూల్యం ...!!
----డా.కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ.
( ఆత్మీయ మితృరాలు ఝన్సీ కొప్పి శెట్టి కి )
Comments