తేడా ....!! (మినీ కవిత)
- కె.ఎల్.వి.
- May 9, 2021
- 1 min read
కనిపించని
అహంకారం ఆమెది ,
అందంతోటేకాదు ...
పసందుగా మాట్లాడి
మనసును ...
పరవశింపజేస్తుంది !
నిజాలు--
ముఖాన మాట్లాడే
ముక్కుసూటి
మనిషి అతడు ....
అతడి మనసు వెన్న!
మాటలతో...
ఆకర్షించడంలో -
చెప్పొద్దూ ..గుండు సున్న !!
---డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,
హన్మకొండ
Comentarios