" గెలుపు..!! " (మినీ కవిత )
- కె.ఎల్.వి.
- May 4, 2021
- 1 min read
ఇద్దరిదీ -
ప్రేమ వివాహమే !
మూన్నాళ్ళ
ముచ్చట తర్వాత
అసలు రంగులు -
బయటపడ తాయి ,
ఇద్దరూ --పందెం ..
కోడిపుంజులౌతారు !
రాత్రికి అతగాడు ,
ఓడిపోయి -
ఆమెను గెలుచుకుంటాడు !!
-----డా . కె . ఎల్ . వి . ప్రసాద్ ,
హనంకొండ
Comments