గాజులు ..గాజులు ..గాజులు
అందమైన గాజులు
రంగు ..రంగుల గాజులు
ఆకర్షణీయమయిన గాజులు !
ఆడ పిల్లలను అమితంగా ,
ఆకట్టుకునే గాజులు
బుజ్జి ..బుజ్జి ..చేతులకు
భలే గఅమరిపోయే గాజులు
అందంగా ఉన్న చేతులకు
మరింత అందం -
సమకూర్చే గాజులు !
రకరకాల గాజులు
రోజువారీ గాజులు
మోజుపడే ..
మ్యాచింగ్ గాజులు ,
మనసును
ఆకట్టుకునే గాజులు
మంచి ముత్యాల గాజులు !
అమ్మమ్మ కొన్నదీ...
బంగారు గాజులు
అమ్మేమో కొన్నదీ....
అన్ని రకాల గాజులు ..!
బయటకు వెళితేనే
బంగారు గాజులు ...
ఇంట్లొనెమో....
మామూలు గాజులు ..
వీటితోనే ప్రతిరోజూ
అలంకారపు మోజు!
బంగారు గాజులకు
బాంకు లాకర్లే దిక్కు
బయటపడే మార్గం కోసం
ఎదురు చూస్తుంటాయి
ప్రతినిత్యం ......!!
గాజులు ..గాజులు ..గాజులు
అందమైన గాజులు ...
రకరకాల గాజులు ...
రంగు రంగుల గాజులు
పిల్లల కోసం గాజులు !
పెద్దలు ముచ్చటపడే గాజులు
ప్రజా రంజకమైన గాజులు !!
---డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,
హన్మకొండ -
*(సరోజినీ నాయుడు' బాన్గిల్ సెల్లర్ 'గుర్తుకువ చ్చి.
అనువాదం-అనుసరణ కాదు)
Comments