ఇప్పుడు
కాలం ఎదురుతిరిగింది
నిత్యజీవన శైలికి
గండిపడింది ....!
ఎందరెందరినో ..
కాటికి --
కాళ్లు చాపేలా చేసింది
మరెందరి ప్రాణాలనో
గాలిలో కలిపేసింది !
అక్కడా ..ఇక్కడా ..
అనికాదు ---
యావత్ ప్రపంచాన్నీ
అల్లకల్లోలంచేసి
భయం గుప్పిట
నొక్కిపట్టింది !
వ్యాపారస్తులకు
ఇది గొప్పవ్యాపారంగా
మారింది....
జ్ఞానం బోధించే
విజ్ఞాన దీపిక అయింది !
పెళ్లిళ్లు -పబ్బాలు
పండుగలు -సమావేశాలు
నామమాత్రం --
అయినాయి ....!
గతాన్ని తలచుకుని
అదే పండుగ అనుకొవాలి
ఇప్పటి అనుభవాన్ని
ఒక పీడకలగా మరచిపోవాలి !
కాలం ఇచ్చే తీర్పుకు
కట్టు బడి ఉండాలి ...!
రాబోయే రోజులన్నీ
మన మంచికే ..అనుకొవాలి!!
------డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,
హనంకొండ
Comments