నీ ధ్యానంలో
నిన్ను ప్రేమిస్తూ
నీ ఆరాధనలో
ప్రతిరోజును
ప్రేమికుల రోజుగానే
ప్రేమిస్తున్నా ...!
ఒక్కరోజులో
నాప్రేమతో
నిన్ను ఉక్కిరిబిక్కిరి
చేయడం ...
నన్ను నేను
మోసంచేసుకోవడమే కాదు ,
నిన్ను తెరచాటుగా
మభ్య పెట్టడమే ...!
ప్రియతమా ....
మనప్రేమ ---
నిత్యం ..నిరంతరం
ప్రేమికులదినమే ...!
అది ..గుర్తు చేయడానికే
ఈ రోజు ఎన్నుకున్నా సుమా !
నీమనసు పరిమళించి
ప్రతిదినం నా ..తనువు
పరవశిస్తూనే ఉంది సుమా !
మన ప్రేమ ....నిత్యం
కుసుమ విలాసం తో,
గుభాళిస్తూనే ఉంది సుమా ..!!
-----డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,
హన్మకొండ .
Comments