అన్ని పండుగల
మాదిరిగానే ....
ఇప్పుడూ ...
హోలీపండుగ
వచ్చింది.
గతసంవత్సరాలకు
భిన్నంగా ఉందిది .
మనిషి బ్రతుక్కీ
మనుష్యుల -
కదలికలకీ ,
రిమోట్ ఇంకా
కరోనా చేతిలోనే ఉంది !
ఆనందం -ఉత్సాహం
అదుపులో -
వుంచుకోమంటుంది ,
మాస్కులేకుంటే
జరిమానాకు
సిద్దంకమ్మంటున్నది ,
రంగులతో చెలగాటమాడితే
జైలు శిక్ష ...
తథ్యం అంటున్నది ,
భౌతిక దూరం పాటించి
నైతిక బాధ్యత --
వహించమంటోంది !
నిజమేగా ....
అదిమన మంచికేగా
ప్రస్తుతానికి
ప్రదర్శనల -
జోలికి పొవద్దు ...
ఆనందం -అభిమానం ,
ప్రేమ -బందుత్వం
ప్రస్తుతానికి
మనసులోనే ..
దాచుకుందాం ,
వచ్చేఏడాది -
రంగుల పండుగ
ఎప్పటిమాదిరిగా
ఆనందంగా గడపడానికి ,
ఇప్పటినుండే --
జాగ్రత్తపడదాం ,
మహమ్మారి
చేతిలోని రిమోట్ ,
మనమే లాగేసుకుందాం !
విశ్వమానవ కళ్యాణార్ధం
కలిసికట్టుగా పనిచేద్దాం ..!!
----డా.కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ.
(కరోనా ..కాలం ...జ్ఞాపకం)
Comments