వేసవికాలం
వచ్చింది ...
మామిడి కాయలు
తెచ్చింది ....!
ఉగాది పండుగ
వచ్చింది ....
ఉగాదిపచ్చడిలో
పుల్లదనం ...
మామిడి ముక్కతో
వచ్చింది ....!
ఉప్పూ -కారం
దట్టించిన
మామిడి కాయ
ముక్కరుచి ....
బాల్యాన్ని
గుర్తు చేస్తుంది
విడమరచి ...!
అవగాయ
అవతారం ....
తెలుగింటి -
మామిడి ఊరగాయ ,
తిరుగులేని
పసందైన పచ్చడి -
వడ్డనం......
ఆహా...ఏమి రుచి....!
కూరగాయతో....
కలిపి తినే
భోజనం అభిరుచి...!!
--------డా.కె.ఎల్.వి.ప్రసాద్,
హన్మ కొండ .
Comments