గూడు లేకున్నా
నీడ దొరికింది
కూడు దొరికే ఉపాయం
ఆమె కష్టించే
చేతుల్లోనే ఉంది ,
ఆశాజీవిగా బ్రతకడం
ఆమెకు ...
వెన్నతో పెట్టిన
విద్య అయింది !
అక్షర జ్ఞానం లేకుంటేనేమి ,
కన్నబిడ్డను
అక్షరజ్యోతిగా -
చేయ పూనుకుంది ,
కష్టపడకుండా -
సుఖం దరిచేరదని ,
ఆమె ఎప్పుడో నమ్ముకుంది
అందుకే ..ఆ అవ్వ ---
ఎక్కడైనా ,
సంతోషంగా -
బ్రతక గలుగుతుంది !
సంతానాన్ని ....ఆ రోగ్యంగా ,
బ్రతికించుకోగలుగుతుంది.!!
*
------డా.కె.ఎల్.వి.ప్రసాద్
హన్మ కొండ .
(రోడ్డు పక్క, ఖాలీ సిమెంటు తూములో సంసారం
సాగిస్తున్న స్త్రీ మూర్తిని చూచి)
Comments