హోలీ అంటే
సంబరమే....!
ఎదురు చూసే
పండుగ దినమే!
అందరికీ ఇది
కోలాహలమే!
ప్రేమకు ఇది
గొప్ప సంకేతమే!
ఆనందానికి మరి
ఇది అవసరమే..!
వళ్ళంతా
రంగులు చల్లుకోవడం
అభిమానానికి
ఆత్మీయతకు సంకేతం !
అభిమానుల మధ్య
బంధువులమధ్య
ప్రేమికులమధ్య
పరస్పర ఆత్మీయతలకు ,
హోలీ ఒక -
హృదయానంద కేళి !
విలువ తెలియకుంటే
అదిఒక
అసందర్భ వికృత క్రీడ !!
-----డా.కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొoన్డ.
గమనిక **
కరోనా కాలం ఇది .
రంగులు చల్లుకోకుండా
భౌతిక దూరం పాటించడమే మేలు
అందరం ఇది తెలుసుకుంటే చాలు **
Comments