top of page
  • Writer's pictureకె.ఎల్.వి.

ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో నూతన పోకడలు ....!! (వ్యాసం)

సాహిత్యం సముద్రం వంటిది . అది ఏ భాష అయినా దాని పరిధి అలాంటిది . తెలుగు భాష దీనికి అతీతం కాదు . తెలుగు సాహిత్యంలో 

అనేక ప్రక్రియలు వున్నాయి . అవి నదుల్లా ,ఉపనదుల్లా ,నూతనత్వం సంతరించుకున్నప్పుడల్లా ,వచ్చి సముద్రంలో కలసి సాహిత్య  పరిధిని 

పెంచుకుంటూ పోతుంది . 

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు . కాలాన్ని బట్టి మనిషి మారాలి . తత్ ఫలితంగా మనిషి ఆలోచనా విధానమూ మారుతుంది . అది సాహిత్యానికి అన్వయించుకున్నప్పుడు ,కొన్ని కొత్త విషయాలు తప్పనిసరిగా వెలుగు 

చూస్తాయి . అందుచేత సాహిత్యంలో అంచలంచెలుగా కొన్ని మార్పులు -

చేర్పులు సంతరించుకుని నూతన పోకడలు పురుడుపోసుకుంటాయి . 

అయితే మొత్తం తెలుగు సాహిత్యంలో క్రమ క్రమంగా వస్తున్న మార్పుల--

ను సమీక్షించే అవకాశం ఇక్కడ లేదు . అందుచేత తెలుగు సాహిత్యంలో

ని ఒక ప్రక్రియను సంక్షిప్తంగా చర్చించే ప్రయత్నం చేస్తాను . 

తెలుగు సాహిత్యంలో ,పద్యం ,కవిత ,కథ ,నవల ,విమర్శ ,నాటకం వంటి 

వివిధ ప్రత్యేక ప్రక్రియలు వున్నాయి . వీటిల్లో ఒక ప్రధానమైన అంశం కవిత గురించి వివరించే ప్రయత్నం చేస్తాను . 

నాటి పురాతన సాహిత్యం అంటే ,అందులోని ఏ ప్రక్రియ అయినా పద్య రూపంలోనే ఉండేవి . అవి కావ్యాలయినా ,నాటకం అయినా క్లిష్టమైన పద్య రూపంలో ఉండేవి . పద్యానికి ఛందస్సు కేంద్ర బిందువు . భాషా --

శాస్త్రంలో చందుస్సు పాత్ర గొప్పది . ఛందస్సుకు సంబంధించి విశేష కృషి 

చేసినవారిలో ,కీ . శే . కోవెల సంపత్కుమారాచార్య (కాకతీయ విశ్వ విద్యాలయం లో తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ,పరిశోధకులు )తరువా

త ,ఆచార్య చేకూరి రామారావు గారు . వీరు చే . రా -గా ,ప్రసిద్ధులు . 

అయితే పద్యం కేవలం పండితులకు మాత్రమే పరిమితమై పోవడం వల్ల 

తెలుగు సాహిత్యం దూరమవుతూ వచ్చింది . పూర్వికులు అందించిన ఎన్నో కావ్యాలు ,ఉపయుక్త గ్రంధాలు సామాన్యుడికి అర్ధంకాక అవి విస్తృతంగా అందుబాటులోనికి రాకుండా పోయినాయి . అవి వారికి 

అందని ద్రాక్షపళ్ళు గానే మారాయి . 

సాహితీ క్షేత్రంలో మహాకవి శ్రీ . శ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు )రంగ ప్రవేశం చేసిన తర్వాత ,కవిత్వం పద్య పంజరంనుండి ,స్వేచ్ఛగా కవితా రూపంలో బయటికి విడుదల అయింది . ఛందస్సుతో సంబంధం లేకుండా ,ఏ చిన్న వస్తువునైనా కవితా అంశంగా స్వీకరించి కవిత్వం రాయవచ్చునన్న శ్రీ . శ్రీ 

ప్రతిపాదన ,పలువురు పండితులిని ,సామాన్య పాఠకులని ఆకర్షించింది . అలాంటి కవిత్వం సామాన్యుడికి సైతం అర్ధం చేసుకునే పరిస్థితి ఏర్పడింది 

పలువురు కవులు శ్రీ . శ్రీ మార్గంలో పయనించడం మొదలు పెట్టారు . అలా కవిత్వం రాసే కవులూ పెరిగారు . శ్రీ . శ్రీ ,భిక్షువర్షీయసి -అనే కవితలో ఎంత సరళమైన భాషలో కవిత్వం చెప్పి పాఠకుడి కాళ్ళ ముందు 

బొమ్మ కట్టించాడో చూడండి . ‘’దారిపక్క ,చెట్టుకింద ,/ఆరిన కుంపటి---

విధాన /కూర్చున్నది /ముసలిదొకతే /మూలుగుతూ -ముసురు తున్న -

ఈగలతో వేగలేక /ముగ్గుబుట్ట వంటి తల/ముడుతలు దేరిన దేహం /కాంతి 

లేని గాజు కళ్ళు /తనకంటే శవం నయం … .. ‘’అంటూ ,మహాప్రస్థానంలో 

ఆయన చెప్పిన ఇలాంటి కవిత్వం ఆయన్ను మహాకవి చేసింది . అలా అని శ్రీ . శ్రీ ఛందస్సు రానివాడు కాదు , ఆయనకూడా ఒకప్పుడు పద్య--

కవి నే !సామాన్యుడికి అర్ధం అయ్యే భాషలో రాయాలనే ఆయన ప్రతిపాద

న తెలుగు సాహిత్యం ఆధునికతను సంతరించుకోవడానికి ఎంతగానో ఉప 

యోగ పడింది . 

ఇలా మహా కవి శ్రీ . శ్రీ ని అనుసరిస్తూనే ,వచన కవితకు బహుళ ప్రాచుర్య

ము తెచ్చిన గొప్ప కవి ,వచన కవితా పితామహుడు కీ . శే .శ్రీ కుందుర్తి ఆంజనేయులు గారు . ఇందులో వీ రు విస్తృత పరిశోధనలు చేసి వచ న - 

కవిత్వానికి వన్నె తెచ్చారు . నగరంలో వాన అనే వీరి వచన కవితాకావ్యం 

గొప్ప పేరుతెచ్చింది . వచన కవిత్వంలో కథలు ,నవలలు రాసే పద్దతిని వీరు ప్రవేశ పెట్టారు . అయితే ఈ ప్రతిపాదన ఎందుకో మంచి ఫలితాలను ఇవ్వలేదు ,కానీ శ్రీ శీలా వీర్రాజు గారు (ప్రముఖ నవలా కారుడు ,కధకుడు 

అనువాదకుడు ,వ్యాసకర్త ,వీటన్నింటిని మించి గొప్ప చిత్ర కారులు )

కుందుర్తి మార్గంలో నడిచి ఎన్నో రచనలు చేశారు . నాటి ఉమ్మడి ఆంద్ర -

ప్రదేశ్ రాష్ట్రంలోని సమాచార శాఖ లో ఇద్దరూ కలసి పని చేయడం వల్ల 

వచన కవిత్వ ప్రచారంలో ఇద్దరూ విశేష కృషి చేశారు . నిజానికి శ్రీ శీలా -

వీర్రాజుగారు ఈ ప్రక్రియలో ఊహించిన దానికి మించి రచనలు చేసినట్టుగా కనిపిస్తున్నది . శ్రీ కుందుర్తికంటే ముందే వీర్రాజుగారు మదిలో ఈ ప్రక్రియ మెదిలినట్టుగా కనిపిస్తున్నది . ఆయన 1956 లో(వీర్రాజు గారి శ్రీమతి ప్రముఖ రచయిత్రి శ్రీమతి శీలా సుభద్రాదేవి గారి సమాచారం ప్రకారం )

‘ వెలుగు నీడలు ‘ పేరుతొ వచ్చిన నవలను 2006 లో ‘ బతుకు బాట ‘ 

పేరుతొ వచన కవిత్వంలో రాశారు . అలాగే వచన కవిత్వం లో ఆరు కథలు రాశారు వీర్రాజుగారి ఆత్మకథ కూడా వచన కవిత్వంలో రాయడం విశేషం !అంత మాత్రమే కాకుండా ‘ మళ్ళీ వెలుగు ‘ వచన కావ్యం కూడా రాశారు . తర్వాత వచన కవిత్వాన్ని ఇంత సీరియస్ గా రాసిన రచయిత

లు ,ఈ వ్యాస కర్త దృష్టికి రాలేదు . ఇది పరిశోధించవలసిన విషయమే !

                         కవిత్వ రచనలో ఒక సునామీలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ 

ప్రక్రియ ‘ నా నీ లు ‘ ఈ ప్రక్రియ సృష్టికర్త ఆచార్య ఎన్ . గోపి . నానీల ప్రక్రియ ఈ మధ్య కాలంలో ఎందరినో యువ రచయితలను ఆకర్షించి బహుళ ప్రాచుర్యం పొందిన ప్రక్రియ ఇది . పేరు ప్రతిష్టలు పొందిన రచయిత లతో పాటు ,లేత .. లేత .. రచయితలూ కూడా ఇప్పటికీ 

నానీలు ఇష్టంగా రాస్తున్నారు . ఆచార్య గోపి తో పాటు ,స్వర్గీయ ద్వానా -

శాస్త్రి గారు కూడా నానీల ప్రక్రియలో విశేషమైన కృషి చేసి పుస్తకం కూడా 

తీసుకు వచ్చారు . చిన్న పాటి నిబంధనలతో నానీలు .. రాసే ప్రక్రియను 

వెలుగు లోనికి తెచ్చినారు శ్రీ గోపి . అవి ఏమిటంటే ,కవిత మొత్తం 20 నుండి 25 అక్షరాలలో పూర్తి కావాలి . మొత్తం నాలుగు లైన్లు ఉండాలి 

మొదటి రెండు లైన్లూ చివరి రెండులైన్లు సమన్వయమై అర్ధవంతంగా ,

కొన్ని విరుపులతో -మెరుపులతో కవితాత్మకంగా సాగాలి . ఇది కొంచెం 

కష్టమైనా ప్రక్రియ అయినా కష్టపడితే చాలా సులభంగా నానీలు రాయవ-

చ్చును . ఫిష్ బుక్ మాధ్యమం ద్వారా ‘ నానీలు ‘ సమూహంతో పాటు ,

అనేక సాహిత్య సమూహాలు నానీలను ప్రోత్సహిస్తున్నాయి . తక్కువ నిడివిలో ఎక్కువ అర్ధాన్ని స్ఫురింపజేసే ఈ నానీల ప్రక్రియ విజయవంతం 

అయినట్టే లెఖ్ఖ . వీటిని అర్ధం చేసుకుని రాసేవాళ్ళ సంఖ్య రోజు రోజుకీ గణనీయంగా పెరుగుతూనే వస్తున్నది . 

అయితే ఈ ప్రక్రియకు ముందే పద్మభూషణ్ శ్రీ బోయి భీమన్న గారు ‘ త్రిపదలు ‘ అనే పద్య కావ్యం రాశారు . అయితే ఈ ప్రక్రియకు ఆద్యులు ఎవరు ?త్రిపదల లక్షణాలు ఏమిటి ?అన్న విషయాలు ఎక్కువ బయటికి రాలేదు కానీ ఈ ప్రక్రియ అంతగా ప్రాచుర్యం పొందలేదని చెప్పాలి . అయితే 

తెలుగు వెలుగులో త్రిపదలు లాంటివి వెలుగు చూసాయిగాని ,రచయితల వివరాలు తెలియరాలేదు ‘’ త్రిపదలు అంటే మూడు పదాలతో’ చెప్తూకొంత 

కాలంగా నూతక్కి రాఘవేందర్ రావు అనే ఆయన తానే సృజన కర్తగా చెప్పుకోవటం జరిగింది ‘’అంటారు ,అనకా పల్లికి చెందిన సీనియర్ రచయిత డా . ఇమ్మడి శెట్టి చక్ర పాణి గారు . ‘ ప్రియమైన రచయితలు ‘ 

వాట్స్ ఆప్ సమూహ అడ్మిన్ లలో ఒకరైన రామ శర్మ (బెంగుళూరు )

తనదైన పద్దతిలో త్రిపదలను రాస్తూ ప్రచారంలోనికి తీసుకు వస్తున్నారు . 

వీరి ప్రకారం కవిత మూడు లైన్లు కలిగి ఒకో లైను లోనూ 16 అక్షరాలకు మించకుండా ఉండాలి . యతి ,ప్రాస ,ఛందస్సు వంటి నియమాలతో పని 

లేదు !అర్ధవంతంగా ,ఆకర్షణీయంగా ,ఏ అంశం మీదైనా రాయవచ్చును. 

‘ పదహారణాలు ‘ అనే పదం ప్రాచుర్యంలో ఉండడం వల్ల 16- అక్షరాల నియమం తానె పెట్టినట్టు ప్రముఖ కవి శ్రీ రామ శర్మ గారు చెబుతున్నారు

ఈ త్రిపదల ప్రాచుర్యానికి శర్మ గారు విశేషమైన కృషి చేస్తున్నారు . 

తెలుగు రాష్ట్రాలలో వచన కవిత్వానికి ,ముఖ్యంగా మినీ కవిత్వానికి పెద్ద పీట వేసి ,అనేక రీతుల్లో ప్రచారం చేస్తున్న మంచి కవి పండితులు శ్రీ రావి 

రంగారావు గారు . పత్రికలలో శీర్షికల ద్వారా ,స్వయంగా పుస్తకాలు ప్రచురించడం ద్వారా రంగా రావు గారు మినీ కవితకు ప్రాణం పోస్తున్నారు

తక్ఖువ అక్షరాల్లో అర్ధవంతమైన కవిత్వం చెప్పడమే మినీ కవిత లక్ష్యం . 

నిజానికి ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియనే !అయినప్పయికి చాలామంది ఈ 

ప్రక్రియకు ఆకర్షితులవుతున్న మాట వాస్తవం . 

కవిత్వం అందించడానికి ఇలా అందుబాటులోనికి వచ్చిన అనేక ప్రక్రియల

తో పాటు ,హైకూలు ,ధంకాలు ,నానోలు ,రెక్కలు ,మొగ్గలు ,త్రినేత్రిలు ,

వ్యంజకాలు,షష్టీలు ,ఇలా అనేక ప్రక్రియలు వెలుగులోనికి వచ్చినప్పటికీ 

అంతగా స్థిరత్వం ఏర్పడలేదు . భవిష్యత్తులో మరిన్ని ప్రక్రియలు మనముందుకు రావచ్చు ,చెప్పలేము . ఎలాంటి ప్రక్రియ వచ్చినా ,పాఠ-

కూడూ ,సమాజమూ ,కవులనుండి ఆశించేది పుష్టికరమైన పుష్టికరమైన 

పండిత -పామరులకు అర్ధమయ్యే కవిత్వం !

సాహిత్య పరంగా ఎన్ని ప్రక్రియలు -మార్పులు వచ్చినా ,ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ ,గ్రాంధీకమూ ,వ్యవహారికమూ ,దాటు-

కుని పద్యం నిలబడింది .. అని చెప్పడం అతిశయోక్తి కాదు . ఎందుచేతనంటే  క్రమశిక్షణతో కూడుకున్న లయాత్మకత పద్యంలో 

వుంది . ఒక్కప్పుడు పండితుల మెదళ్లలోనే నిక్షిప్తమై యున్న పద్యం 

సామాన్యుడి కి అందుబాటులోనికి వచ్చి యువతను ఆకర్షిస్తున్నది . నేటి ఆధునిక కవిత ఎన్ని కొత్తరూపాలను పొందినా ,పద్యం ఎప్పటికీ చిరంజీవే!

ఆధునిక తెలుగు సాహిత్యంలో ,ముఖ్యంగా తెలుగు కవిత్వంలో ,కవితను-

పద్యాన్నీ వేరుగా చూడడానికి వీలు లేదు . 


*యోజన మాస పత్రిక లో ప్రచురితము*



--డా.కె.ఎల్.వి.ప్రసాద్,

హన్మ కొండ .



1 view0 comments

Recent Posts

See All

కృతఙ్ఞతలు...!! (చిరు వ్యాసం)

నాజీవితం ఒక కుదుపుతో మలుపుతిరిగి ఈ రోజున ఇలా మీమధ్యన ,ఒక దంతవైద్యుడిగా , కవిగా,కథా రచయితగా ,వ్యాసకర్తగా ,వున్డడానికి నలుగురు ప్రధాన వ్యక్తులు వున్నారు. నేను అనారోగ్య పరి స్తితికి గురిఅయినప్పుడు తన అప

రేడియో తో ...#3 (అనుభవాలు ___జ్ఞాపకాలు ...వ్యాసం)

ఆకాశవాణి ,హైదరాబాద్ లో ,యువవాణి కార్యక్రమాలతో ,నా రేడియో జీవితం ప్రారంభమైంది .నన్ను రేడియో కి పరిచయం చేసిన మితృడు డా .సత్యవోలు సుందర శాయి.ఇద్దరం బి.ఎస్ .సి .మొదటి సంవత్సరం కలిసి చదువుకున్నాము .అలా ఇద్

రేడియో తో...... #2 (అనుభవాలు---జ్ఞాపకాలు.....వ్యాసం)

నేను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలొ ,పనిచేస్తున్న కాలంలో ,అంటే 1982_1994,మద్య కాలం లో ,ఆకాశవాణి హైదరాబాద్ ,కేంద్రానికి స్త్రీల దంత సమస్య లకు సంబంధించి ,ఒక ప్రసంగ వ్యాసం పంపించాను.అప్పటిలో ఆ విభాగం స్

Post: Blog2 Post
bottom of page