తెలుగు సాహిత్య ప్రక్రియలలో ,కథ -కు ప్రత్యేక స్థానం వున్నది. కథ ను రాయడం ఎంత సులభమో ,అంత కష్టం కూడాను !ప్రతి వ్యక్తిజీవితంలో
ఎన్నో అనుభవాలు ,సంఘటనలు,చోటుచేసుకుంటాయి. అలాగే తన
నిత్యా జీవన సరళిలో ,ఇతరుల ద్వారా అనేక విషయాలు మనసులో
ముద్రపడిపోయి ఉంటాయి. ఉపయోగించు కోదలచుకుంటే అవన్నీ ఒత్తి కథకు ముడిసరుకుగా ఉపయోగపడే వస్తువులే !వచ్చిన చిక్కల్లా వాటిని
కథా రూపంలో నగిషీలు చెక్కడం లోనే . అందుచేత అందరి దగ్గర కథలు
కావలసినన్ని ఉంటాయి . కానీ,వాటిని వస్తువులుగా స్వీకరించి కథలుగా
మలిచే సామర్ధ్యం కొద్దిమందికే వస్తుంది . అదికూడా ,ఎవరైతే కథలు విప
రీతంగా,చదవ గలుగుతారో ,వారికే కథ రాయగల (చెప్పగల )నేర్పు వస్తుంది. వాళ్ళే కథా రచయితలుగా మిగులుతారు .
తెలుగు భాషకే ముప్పు వాటిల్లుతున్నదని ,భాషా పండితులు,మేధావు
లు,మొత్తుకుంటున్న నేపథ్యంలో,కథలు ఎంతమంది చదువుతున్నారనే
విషయాన్ని పక్కనపెడితే ,ఈనాడు కథలు రాయదగ్గ రచయితల సంఖ్య
తక్కువేమీ కాదని చెప్పక తప్పదు. దానికి నిదర్శనం ,ఈ నాడు మనకు
అందుబాటులోనికి వచ్చిన అనేక దిన,వార ,మాస ,పత్రికలు,నెట్-మ్యాగ
జైన్లు ,అవి కథలకు ఇస్తున్న ప్రోత్సాహం ,వీటికి తోడు రేడియో వంటి మాధ్య మాలు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
సమాజం లో ఎదురవుతున్న కొన్ని సమస్యలు,మూఢనమ్మకాలు,చేద-
స్థాఫు చేష్టలను కథా వస్తువులు గా స్వీకరించి అనేకమంది రచయితలు
కథలు రాస్తున్నారు . దీనివల్ల కొంతైనా సమాజంలో మార్పు వచ్చి
ఆరోగ్యకరమైన జీవన విధానాలకు అలవాటు పెడతారనే దూర దృష్టి రచ
యితలది కావచ్చు !ఈ నేపథ్యంలో ,సమాజంలో ఇప్పటికీ రగులుతున్న
సమస్య ‘ఆడపిల్ల పుట్టుక ‘
ఆడపిల్ల -పేరుతో ఏప్రిల్ నెలలో ఒక మాస పత్రిక చక్కని కథను ప్రచురిం
చింది . ఈ మధ్యకాలంలో ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. దానికి
ప్రధాన కారణం ,రచయిత కథను మూడు ముఖ్య భాగాలుగా విభజించు
కున్నట్టు అర్ధం అవుతుంది . కథలోని ‘జిస్ట్ ‘ను ప్రకటించడానికి చాలా
తెలివిగా రెండు పాత్రలను ఎంచుకున్నారు. ఆ పాత్రలు-ఒకటి గోమతి ,
రెండు -గంగ . గోమతి ఇంటివాళ్ళు పెంచుకుంటున్న ఆడపిల్ల ,ఆమె
‘పెద్దమనిషి’అయ్యి సంవత్సరం అయింది . గంగ ఆ ఇంటిల్లిపాదీని పెంచు
తున్న పాలిచ్చే గేదె !అది వొట్టిపోయిన గేదె ,అది పాలివ్వడం మానేస్తే ఆ.. కుటుంభం జీవన వ్యవహారమే తేడా వచ్చేస్తుంది. గోమతి,గంగా,రెం
డూ ,స్త్రీ లింగాలే ,లేదంటే గోమతి మానవలోకంలో బాలికగా పుట్టి ,సమా-
జంలో లింగ భేదానికీ ,వివక్షతకు గురి అవుతున్న రేపటి మహిళ! గంగ
విషయం వచ్చేసరికి ,అది పశు జాతికి సంభందించినది అయినప్పటికీ ,
సమాజం దాని అవసరాన్ని కోరుకుంటున్నది. జనం ఆలోచనా విధానం
లోని మర్మాన్ని చాలా అర్ధవంతంగా విశదీకరించడానికి రచయిత చాలా
బాగా ఆలోచించి ఈ పాత్రలను ప్రవేశపెట్టినట్టుగా అర్ధం అవుతుంది .
కోడలు ,పది సంవత్సరాలైనా పిల్లలిని కనకపోవడం వల్ల ,అత్త ఆమెను
గొడ్రాలిగా చిత్రిస్తుంది తప్ప,కొడుకులో ఏమైనా లోపం ఉందేమో అన్న
ఆలోచన,ఇంగిత జ్ఞానం ,ఆమెకు ఉండదు. పైగా పిల్లలకోసం అని,కొడు-
కుకి ,రెండో పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడడం ,ఇప్పటికి సమాజంలో
వేళ్లూనివున్న మూఢనమ్మకాలను రచయిత ఈ కథ ద్వారా గుర్తు చేస్తా-
రు.
రెండో పెళ్లి ప్రస్తావన తెస్తే ,భార్య ఎక్కడ బాధపడ్తుందోనని ,దత్తత తీసుకో
డానికి,ప్రయత్నిచినా ముందు తల్లి ససేమిరా అంటుంది. కానీ,తమ్ముడి కూతురినే దత్తత తీసుకుంటాననేసరికి,కాస్త చల్లబడుతుంది.మనం ఏదో
వైజ్ఞానిక యుగంలో బ్రతుకుతున్నామని గొప్పలు చెప్పుకునే ఈ కాలంలో కూడా, మూఢ నమ్మకాల విషయంలో మనలో ఎలాంటి
మార్పు రాలేదని అర్ధం అవుతుంది. ఈ కథలో మరొక విశేషమైన,ముఖ్య
మైన ,విషయం ఏమంటే,గేదె గర్భం ధరించి నప్పుడు మళ్ళీ గేదె పుట్టే
విధంగా ఉపయోగపడే ఇంజక్షను గురించి ఆరా తీసిన తల్లి,పద్నాలుగేళ్ల
తరువాత కోడలు వేవిళ్లు తాలూకు వాంతులు చేసుకుంటుంటే ,తల్లి ఆమెకు పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వకపోవడం,పైగా,’’నువ్వెళ్ళరా పెద్దోడా !
ముందు గంగ కి ఇంజక్షన్లు వేయించి తీసుకురా. సాయంత్రం కోడలిని
డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లొచ్చు ‘’అని ,హుకుం జారీ చేస్తుంది .
కోడలు ఎట్టకేలకు ,నీళ్ళాడిందని సంతోషించక పోగా ,కోడలు పొరపాటున బిడ్డను కంటే ,పెంచుకుంటున్న గోమతి భవిష్యత్తును గురించి ఆలోచించి
తల్లి ,చిన్న కొడుకు (గోమతి ,అసలు తండ్రి)కలిసి ,లక్ష్మికి అబార్షన్ చేయించాలనే కుట్ర పూనడం పాఠకుడిని కంట తడి పెట్టిస్తుంది. పెద్ద కోడుకు హనుమంతప్పను, ఒప్పించి భార్య లక్ష్మి కి అబార్షన్ చేయించా
లనే కుట్రను,హనుమంతప్ప కూతురు గోమతి (పెంచుకున్న తండ్రిని పెద్ద
నాన్నా అని,తల్లి లక్ష్మి ని అమ్మా .. అని పిలుస్తుంది )గ్రహిస్తుంది. కథకు
జీవం అంత గోమతి తదుపరి చర్యలతోనే పురుడు పోసుకుంటుంది. ఊహించని రీతిలో కథ మలుపు తిరుగుతుంది. రామదేవమ్మ,పెద్దకొడు-
కు,హనుమంతప్ప, చిన్నకొడుకు శంకరప్ప,లక్ష్మి కి అబార్షన్ చేయించే
విషయంలో తర్జనభర్జనలు చేస్తున్నప్పుడు,తల్లి రామదేవమ్మ హనుమంతప్పను ఒప్పించడానికి బిగ్గరగా స్వరం పెంచి మాట్లాడుతున్న
సమయంలో,సన్నివేశంలోనికి చిన్న పిల్ల గోమతి ప్రవేశిస్తుంది. అంతేకాదు,’’ఏంటీ మహాసభ .. ?’’అంటుంది. ఈ ప్రశ్నకు అసలు తండ్రి
శంకరప్ప ఖంగు తింటాడు. తర్వాత రామదేవమ్మ,గోమతిని చిన్నపిల్లగా
తీసి పారేసి ,అక్కడినుండి కడలి వెళ్ళిపోయి చదువుకోమంటుంది,’పెద్ద
విషయాలు నీకెందుకు ‘అని ప్రశ్నిస్తుంది. ఇక్కడ రచయిత గోమతి చేత
ఆసక్తికరమైన మాటలు చెప్పిస్తాడు.
‘’పెద్ద విషయాలు అంటే ఎంటే ముసిలీ !వయస్సులో పెద్దవాళ్ళు,చిన్న
చిన్న విషయాలు చిల్లర విషయాలు మాట్లాడితే ,అవి పెద్ద విషయాలై-
పోతాయా?అమ్మ కడుపుతో వుంది . పెద్దనాన్నకి తండ్రి కావాలన్నకోరిక
తీరకుండా,నీవు శంకరం నాన్న,అడ్డుపడుతున్నారు ‘’అంటుంది. నాయనమ్మ అరిచినా,వెళ్లిపొమ్మని కేకలు పెట్టినా,కదలకుండా వాళ్ళ
నలుగురి మధ్య కూర్చుంటుంది. అంత మాత్రమే కాదు,’’ఏం ?నన్ను
కూడా,అమ్మ కడుపులో పెరుగుతున్న ఆడపిల్లని చంపేయాలనుకున్న
ట్టు,ఏ మందో మాకో ,శంకరం నాన్నతో పెట్టించి చంపేస్తారా?నేను రెడీ
చంపెయ్ ‘’అని ,నాయనమ్మకు సవాలు విసురుతుంది . ఈ మాటలకు
అందరూ విస్తుపోతారు .
ఆడపిల్లకు పుట్టే హక్కు లేకపోతే ,మన ముగ్గురికి బ్రతికే హక్కులేదని
మూడు ఆసిడ్ బాటిళ్లు తెచ్చి,తల్లిని ,నాయనమ్మను,ఆహ్వానించి
ముగ్గురం ఆసిడ్ తాగి చచ్చిపోదాం అంటుంది. ఆమె మాటలు తట్టుకోలేక
లక్ష్మి,హనుమంతప్ప,ఆసిడ్ బాటిల్ను అవతలికి తోసి గోమతిని కౌగ లించు కుంటారు.
కథ చివర -రచయిత ఇలా చెప్పి ముగిస్తాడు.
రామదేవమ్మ,శంకరప్ప,మంచు శిల్పాలైపోయినారు. ఇద్దరి మనసుల్లో
ఒకే ప్రశ్న -’’పుట్టాల్సిన ఆడపిల్లల్ని చంపేస్తున్నాం. అంతకు ముందే
పుట్టిన ఆడపిల్లల్ని ఏం చేయాలి?’’అని.
కథ చివరివరకు ఆసక్తిని రేపి వదలకుండా చదివిస్తుంది. ఐతే చిన్న పిల్ల
గోమతి చేత రచయిత మాట్లాడించిన మాటలు, ఆసిడ్ బాటిళ్ల ఉదంతం
కొంత మందికి నచ్చకపోవచ్చు,దానికి ఎవరూ ఏమీ చేయలేరు !
ఆడపిల్ల వద్దు అనుకునే వారికి బుద్ధి వచ్చేలా కథా రచన చేశారనడంలో
ఎలాంటి సందేహము లేదు. అందుకే ఈ కథ నాకు బాగా నచ్చింది !!
ఈ కథ
‘ఆడపిల్ల ‘రచయిత శ్రీ ఈతకోట సుబ్బారావు అభినందనీయుడు.
* * *
------డా.కె.ఎల్.వి.ప్రసాద్
హన్మ కొండ.
Comments