అమ్మకువందనం!! (కవిత)
- కె.ఎల్.వి.
- May 9, 2021
- 1 min read
అమ్మలున్న వారు
అదృష్ట వంతులిలలోన ,
అమ్మ ప్ర్రేమ నోచుకున్న
ధన్య జీవులు వారు !
అమ్మ ను ప్రేమించు
అదృష్టము వారిది ,
అమ్మ సేవచేయు
పుణ్య జననం వారిది !
అమ్మ ఉండి కూడా -
ఆత్మీయతలు లేక ,
కొంగ జపము చేయువారు
కూడా-కోకొల్లలు మనలోన !!
----డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,
హన్మకొండ
Kommentare