ముఖం ముడతలు
పడితే ....
అది వృద్దాప్యం కాదు !
దవుడ -
పళ్లూడిపోతే .....
అదివృద్దాప్యం కాదు !
నడుం వంగిపోతే
అది .....
వృద్దాప్యం కానేకాదు ..!
వృద్దాప్యం గురించి
ఆలోచిస్తే ....
అప్పుడది వృద్దాప్యం !
ఉద్యోగ విరమణతో
అతిగా ఆలోచిస్తే ...
అది వృద్దాప్యం ....!
వృద్దాప్యానికి
వయసుతో పనేలేదు ,
మనసు ....
వృద్దాప్యం గురించి
ఆలోచించ నంత కాలం
మనిషి -
వృద్ధుడు కానేకాడు !
వృద్దాప్యానికి
దూరం అతడు ....!!
------డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,
హన్మకొండ .
Comments