top of page
  • Writer's pictureకె.ఎల్.వి.

బాలమనసులు ..!! (చిన్నపిల్లల కథ)

బడిలో ఆటల బెల్లు కొట్టారు . ఆ .. బెల్లు కోసమే చాలామంది పిల్లలు ఎదు

రు చూస్తుంటారు . కొందరు ఆడుకోవడానికైతే ,మరికొందరు ,సరదాగా కాల క్షేపం చేయడానికి . బడిగంట మ్రోగగానే పిల్లలందరూ బిల .. బిల .. 

మంటూ ఆటల స్థలంలోకి పరిగెత్తారు . ఆటస్థలం అంతా పిల్లలతో నిండి 

పోయింది . పిల్లలంతా తమకిష్టమైన క్రీడను ఎంచుకుని ఆడుకుంటున్నా

రు . పిల్లలందరి ఆటలను డ్రిల్లు మాస్టారు ఒక ప్రక్కన వుండి ,పర్య వె క్షి 

స్తున్నారు . 

చంటి .. ఒక్కడూ మాత్రం ఆటస్థలంలో ఒకమూల చెట్టుకింద ముఖం 

రెండు తొడల మధ్య దాచుకుని ,వంటరిగా ,దిగులుగా , కూర్చుని వున్నా

డు . నున్నని, గుండ్రని ,అతని  బుగ్గలపైన కన్నీళ్లు ధారలా కారుతున్నాయ్ . అతని అందమైన ముఖం వాడిపోయి వుంది . ఎవరూ 

అతనితో ఆడడానికి ఇష్టపడడం లేదు . 

‘’ అరేయ్ .. బండోడా !నువ్వు బంతి ఆట ఆడుతావుగానీ .. ఆ బరువు శరీరం తో నువ్వు అసలు పరిగెత్త లేవు !’’ అంటూ ,చంటిని అవహేళన చేసాడు జానీ . 

‘’ రేయ్ .. చంటీ .. ఈ బంతి పట్టుకోరా .. ‘’అని ,గురిపెట్టి బంతిని బలంగా 

చంటి నెత్తి మీదికి విసిరాడు ,శ్యామ్ . 

‘’ అబ్బా ,, ! దెబ్బ గట్టిగా తగిలిందిరోయ్ .. నన్ను ఇలా వంటరిగా వదిలే

య్ ‘’ అంటూ తల గట్టిగా పట్టుకుని ,అరిచాడు  చంటి . 

                                     ***********

శ్యామ్ చేసిన తుంటరి పనిని ,దూరంగా నిలబడి ,పిల్లల ఆటలను గమని

స్తున్న ,విమల -టీచర్ ,చూసింది . దెబ్బ తగిలిన చంటి దగ్గరకు వెంటనే 

పరుగుపరుగున వచ్చింది ,విమల టీచర్ . 

‘’ ఇదిగో .. కుడి చేతి వైపు దెబ్బ తగిలింది టీచర్ ‘’అంటూ ,దెబ్బ తగిలిన 

తన నుదుటిని టీచర్ కు చూపించాడు చంటి . 

‘’ అయ్యో .. దెబ్బ బాగా తగిలింది పద .. హాస్పిటల్ కు వెళదాం ‘’ అంటూ 

మిగతా పిల్లలందరూ ,క్లాస్ రూమ్ కు వెళ్ళగానే ,

‘’ ఈ వాళ చెప్పవలసిన చరిత్ర పాఠం తీసి చదువుతుండండి ,నేను ఆసు

పత్రికి వెళ్లి చంటికి ,కట్టు కట్టించి ,మందులు తీసుకు వస్తాను . శ్యామ్ -

జానీ ,లను క్లాస్ లీడర్ ,ఉత్తమ్ -ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకు వెళతాడు . 

ఈ మధ్య ఈ ఇద్దరి అల్లరీ బాగా ఎక్కువైంది ‘’ అంది ,విమల టీచర్ . 

చంటిని తీసుకుని ,విమల టీచర్ హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు . చంటి 

తలకు తగిలిన దెబ్బవల్ల తలనొప్పితో విపరీతంగా బాధపడుతున్నాడు . బాధ క్రమముగా ఎక్కువై ,చంటి ఏద్వడం మొదలు పెట్టాడు . ఇక చేసేది 

ఏమీ లేక ఆసుపత్రిలో తాత్కాలికంగా ప్రధమ చికిత్స చేసి ,చంటిని వెంటనే 

ఇంటికి తీసుకువెళ్ళమని ,చంటి -తల్లిదండ్రులకు సమాచారం అందించారు 

                                     ***********

క్లాసులో విమల టీచర్ పాఠం చెప్పడం మొదలు పెట్టారు . ‘’ ప్రియమైన 

విద్యార్ధీ -విద్యార్థినులారా ,నిజానికి ఈ సమయంలో మనం చరిత్ర పాఠం 

చెప్పుకోవలసి వుంది . కానీ ,ఇప్పుడు నేను ఆ .. పని చేయబోవడం లేదు . 

మీరంతా చదువులో చురుగ్గా ,ముందుంటున్నారు గానీ ,జీవితానికి అవసరమైన కొన్ని ముఖ్యాంశాలిని తెలుసుకోవడంలో చాలా వెనకబడి 

పోతున్నారు . మనకు ఎట్లాగూ -మానవత్వం ,జాలి -దయ ,నీతి -నియ 

మం ,వంటి అంశాలను అవగాహన చేసే పాఠం మనం చెప్పుకోవలసి వుంది . కనుక అవసరాన్ని బట్టి ఆ .. పాఠమే ఇప్పుడు చెప్పుకుందాం . 

                       చంటి ,మీ అందరికంటే ,కొద్దిగా బొద్దిగా ,లావుగా 

ఉంటాడు . దానికి అతనేమీ చేస్తాడు పాపం !అది దైవ నిర్ణయం ,ప్రకృతి 

అందించిన ప్రసాదం . అందరూ ఒకేలా ఎలావుంటారు ?రంగు ,పొట్టి -

పొడుగు ,లావు -సన్నం,అందం-వికారం ,ఇలా ఎన్ని తేడాలైనా ఉండ--

వచ్చు !అందుచేత ,కొన్ని అనారోగ్య కారణాలవల్ల చంటి -అలా బండగా 

కనిపిస్తున్నాడు . దానికి పాపం, ఆటను ఏమి చేయగలడు ?అలా అని 

అతనిని మీరు రకరకాలుగా వేధించ వచ్చునా ?

నిజానికి ,చంటి -చాలా మంచి అబ్బాయి . గొప్ప సేవాగుణం కలవాడు . 

మంచి ప్రేమగల కుటుంబ నేపధ్యం గలవాడు . ఆసుపత్రి లో ఎన్నో 

సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ ,వృద్ధులకు పళ్ళు -పుస్తకాలూ అందిస్తాడు. 

అంతేకాకుండా ,వాళ్లకు పుష్ప గుచ్చాలు అందించి ,జీవితం పట్ల ఆశను 

కలుగజేస్తాడు . మరి మీలో ఎంతమంది ఇలాంటి గొప్ప కార్యక్రమాలు 

చేస్తున్నారు చెప్పండి ?

మీకింకో విషయం తెలుసా ?చంటి - ఈ మధ్య సంగీతం మీద అభిరుచి 

పెంచుకుని ,వయోలిన్ నేర్చుకుంటున్నాడు . క్రాస్ వర్డ్ పజిల్స్ -పూర్తిచే

యడం చంటి కి యెంత ఇష్టమో మీకు తెలుసా ?ఆ .. అలవాటు ,మీ వయసు పిల్లల మెదడుకు మంచి పదును పెడుతుంది . 

అందుచేత ,ఎవరికి ఎందులో అభిరుచి ఉంటుందో ,దానిని ఇష్ట పడతారు . 

ఎదుటివాళ్లను చూసి ,వాళ్ళుకూడా మనలాగే ఉండాలనే నిర్ణయం చేయడం ఏమాత్రం న్యాయం కాదు కదా !ఇంతకీ మీ అందరికీ నేను 

చెప్పొచ్చేదేమిటంటే ,మీరంతా చంటి తో ,స్నేహంగా మెలగాలి . అతనిని మీలో ఒకడిగా ఉంచుకోవాలి . ఏ విషయంలోనూ అతనిని వేరుచేసి చూడ 

కూడదు సుమా !అతనితో స్నేహంగా ఉండడం వల్ల మీకు తెలియని విషయాలు అతని ద్వారా నేర్చుకొనవచ్చును ,అలాగే ఎవరైనా ను !

బడిలోనూ ,బడిబయట ,మీరంతా ఒక్కటే అన్నట్టుగా మెలగాలి . మరి ఇక ఇప్పుడు చరిత్ర పాఠంలోనికి వెల్దామా ?’’ అని ,ముగించారు విమల టీచర్ . 

ఎప్పటిలాగే ,ఆరోజు కూడా బడికి వచ్చాడు చంటి . ఎప్పుడూ అతనిని అసలు పట్టించుకొకుండా ,దూరంగా కూర్చునే ,రజని వచ్చి అతని పక్కన 

కూర్చుంది . అంతమాత్రమే కాదు ---

‘’ నేను ,నీ స్నేహితురాలిగా ఉండడానికి ఇష్ట పడుతున్నా ‘’అంది రజని . 

‘’ నేను కూడా .. !!’’ అన్నాడు ,నవ్వుతూ చంటి . 

‘’ మేమంతా .. నీ జట్టు సుమా !’’ అన్నట్టుగా ,చంటిని నవ్వు ముఖాలతో 

పలకరించారు ,మిగతా క్లాసు పిల్లలంతా . అందులో -జానీ ,శ్యామ్ కూడా 

వున్నారు !

చంటి మనస్సు ఆనందంతో ఊయల లూగడం మొదలు పెట్టింది . 

( ధీ హిందూ ఆంగ్ల దినపత్రిక సౌజన్యంతో )


                          ***********

     


-----డా . కె . ఎల్ . వి . ప్రసాద్ 

                    హన్మకొండ . 

0 views0 comments

Recent Posts

See All

పరిష్కారం ..!! ( పిల్లల కథ )

శేఖర్ బా బు ... చాల బొద్దుగా అందంగా ఉంటాడు.పెళ్లిఅయిన పది సంవత్సరాలకు ,ఆనంద్ -శ్రీలేఖలకు పుట్టిన విలువైన సంతా నం ,శేఖర్ బాబు .తల్లిదండ్రులకు గారాల బిడ్డ .ఇంట్లోఅందరికీ అతడొక జీవమున్న ఆటవస్తువు అయిపోయా

అపరిచితుడు ..!! (కథ)

మధ్యాహ్నం 11గం. లు ,అయి ఉంటుంది. ఔట్ పేషేంట్ డిపార్ట్మెంట్ లో ,పేషేంట్స్ ను చూడ్డం పూర్తి కావడంతో,బ్రీఫ్ కేస్ లోఉన్న వారపత్రిక తీశాను,ఓసారి శీర్షికలు చూద్దామని.నిజానికి అంత సమయం రోజూ దొరకదు,కానీ ఆ రోజ

   తిక -మక !! (చిన్న -హాస్య కథ)

కరోనా కాలం ఇది . అయినా ,అక్కడ జనసందోహం బాగానే వుంది . కొందరు సగం మూతికి మాస్కు పెట్టుకుంటే ,కొందరు మాస్కును మేడలో వెళ్లాడ దీసుకున్నారు మూర్ఛ రోగుల్లా . అక్కడ ఎవరూ స్థిమితంగా ఒకే చోట కూర్చోలేక పోతున్నా

Post: Blog2 Post
bottom of page