top of page
  • Writer's pictureకె.ఎల్.వి.

పరిష్కారం ..!! ( పిల్లల కథ )

శేఖర్ బా బు ...

చాల బొద్దుగా అందంగా ఉంటాడు.పెళ్లిఅయిన

పది సంవత్సరాలకు ,ఆనంద్ -శ్రీలేఖలకు పుట్టిన

విలువైన సంతా నం ,శేఖర్ బాబు .తల్లిదండ్రులకు

గారాల బిడ్డ .ఇంట్లోఅందరికీ అతడొక జీవమున్న

ఆటవస్తువు అయిపోయాడు .అతని అందచందాలూ ,ఆటపాటలు ,చదువుసంధ్యలు ,

ఇంటా -బయటా మాత్రమేకాదు ,బడిలోకూడా

అందరి ప్రశంశలు పొందుతాయి.చదువులో క్లాసు

ఫస్టు ,ఆటల్లో అతడే ఫస్టు .వ్యాసరచన,చిత్రలేఖ

నం ,వ్యాసరచన ,వక్తృత్వం ..ఇలా అన్నింటిలోనూ

అతడిదే పైచెయ్యి.

ఇంతకీ శేఖర్ వయసు పదిదాటలేదు.ఎప్పుడూ

ఉల్లసంగా ,ఉత్సాహంగా ఉంటాడు.బడినుండి

ఇంటికివస్తే ,హోంవర్కు -ఆటలు తప్ప ,పెద్దగా

చదవడు కూడా !బడిలో చెప్పిన పాఠాలు శ్రద్దగా

వింటాడు అంతే ,ఫస్టు మార్కులు కొట్టేస్తాడు.

అందుకే ,ఏకసంధాగ్రాహి అన్న బిరుదుకూడా

సంపాదించుకున్నాడు .

ఇలాంటి ,మంచిబాలుడుగా గుర్తింపు పొందిన

శేఖర్ బాబు ,ఈమద్య ఎందుకో చాల ముభా వం

గా ,డల్ గా ..ఉంటున్నాడు.క్లాసులో ఎప్పుడూ

మొదటి వరస బెంచిలో కూర్చునేవాడు ,ఈమద్య

ఆఖరి బెంచీలో కూర్చొంటున్నాడు.విశయం

క్లాసులో ,సహాధ్యాయులకూ -ఉపాధ్యాయులకూ

తెలిసి నా ..ఇంట్లో తల్లిదండ్రులకు మాత్రం శేఖర్

అలా ఎందుకు మారిపోతున్నాడో తెలియదు.

ఎవరితోనూ ,ఎప్పుడూ ,ఒక్కమాటకూడా అ ని ..

పించుకోని ,శేఖరును పలకరించాలంటేనే ,అతడి

తల్లిదండ్రులు భయపడుతున్నారు .ఇక ఎక్కువ

కాలం నిర్లక్షం చెస్తే పరిస్తితులు చేయిజారిపోతా ..

యన్న భయంతొ ,తల్లిదండ్రులు ఒకనిర్ణయం

తీసుకుని ,శేఖర్ కు తెలియకుండా ,శేఖర్ క్లాసు

టీచర్ను కలుసుకున్నారు.

మాష్టారు ,శేఖర్ గురించి చెప్పిన విషయాలు విన్నాక

మాట రా ని వారై ,విస్తుపోయారు.ఇక ఏమాత్రం

ఆలశ్యం చేయకుండా ,శేఖరును వైద్యుడి దగ్గరకి

తీసుకుపోయారు.డాక్టరు శేఖర్ ను పరీక్షించి

అసలు విశయం చెప్పేసరికి ,వాళ్లు అది నమ్మలేకపొయారు .రోజు తమ కళ్లముందు తిరిగే

తమ ముద్దుల తనయుడి సమస్యను గుర్తించ లేక

పోయినందుకు చాల బాధపడ్డారు.నెలరోజుల్లో

శేఖర్ సమస్యకు పరిష్కారం దొరికింది.ఇప్పుడు

ఎప్పటి మాదిరిగానే ఉత్సాహంగా -ఉల్లాసంగా

ఉంటున్నాడు.కొడుకు మల్లీ మామూలు మనిషి

అయినందుకు,తల్లిదండ్రులు ఎన్తగానో సంతోషిన్చారు.ఇన్తకీ శేఖర్ సమస్య ఏమిటో

తెలుసా ..!ఊడిపోవలసిన పాలపళ్లు ఊడిపోక

రెండువరుసల పళ్లు ఉండి ,పంటి శుభ్రత లోపించి

నోటిదుర్వాసన రావటమే !

పిల్లలూ ...మరి పంటి పరిశుభ్రత విషయంలో ...

బహుపరాక్ సుమా ..!!


-------డా.కె .ఎల్.వి .ప్రసాద్ ,

హన్మకొండ .

1 view0 comments

Recent Posts

See All

అపరిచితుడు ..!! (కథ)

మధ్యాహ్నం 11గం. లు ,అయి ఉంటుంది. ఔట్ పేషేంట్ డిపార్ట్మెంట్ లో ,పేషేంట్స్ ను చూడ్డం పూర్తి కావడంతో,బ్రీఫ్ కేస్ లోఉన్న వారపత్రిక తీశాను,ఓసారి శీర్షికలు చూద్దామని.నిజానికి అంత సమయం రోజూ దొరకదు,కానీ ఆ రోజ

   తిక -మక !! (చిన్న -హాస్య కథ)

కరోనా కాలం ఇది . అయినా ,అక్కడ జనసందోహం బాగానే వుంది . కొందరు సగం మూతికి మాస్కు పెట్టుకుంటే ,కొందరు మాస్కును మేడలో వెళ్లాడ దీసుకున్నారు మూర్ఛ రోగుల్లా . అక్కడ ఎవరూ స్థిమితంగా ఒకే చోట కూర్చోలేక పోతున్నా

నాన్నా ..పెళ్లి చేయవూ ..!! (కథ)

‘’నాన్నా … ‘’అని ,పిలిచింది స్వప్న . ‘’ఏమిటమ్మా …. ‘’అన్నాడు అప్పటికే కిందికి మెట్లు దిగి బయటికి వేళ్ళ బోతున్న ,స్వప్న తండ్రి రాఘవరావు. వెనక్కు తిరిగి మళ్ళీ తనవైపే  రాబోతున్న తండ్రిని ,చేతులతో సైగ చేస

Post: Blog2 Post
bottom of page