top of page
  • Writer's pictureకె.ఎల్.వి.

నాన్నా ..పెళ్లి చేయవూ ..!! (కథ)

‘’నాన్నా … ‘’అని ,పిలిచింది స్వప్న . 

‘’ఏమిటమ్మా …. ‘’అన్నాడు అప్పటికే కిందికి మెట్లు దిగి బయటికి వేళ్ళ 

బోతున్న ,స్వప్న తండ్రి రాఘవరావు. 

వెనక్కు తిరిగి మళ్ళీ తనవైపే  రాబోతున్న తండ్రిని ,చేతులతో సైగ చేసి 

రావద్దని వారిస్తూ -----

‘’ఏంలేదు నాన్నా .. ఏదో చెప్పాలను కున్నాను ,తీరా మీకు చెబుదామని 

అనుకునేసరికి,అది కాస్తా మరిచిపోయాను ,మీరు జాగ్రత్తగా వెళ్ళండి నాన్నా .. ‘’అని ,ఇంటి మొదటి అంతస్థు మీద నుండే తండ్రికి సెండ్ ఆఫ్ 

ఇచ్చింది స్వప్న. 

రాఘవరావు బయటపడి ,రోడ్డు మీద అటువైపు వెళుతున్న షేర్ ఆటో ఆపి,అక్కడి నుంచే కూతురికి ‘బై .. ‘చెప్పి ముందుకు సాగిపోయాడు. 

రాఘవరావు ,ఏ . జీ ,ఆఫీసులో సూపరింటెండెంట్ హోదాలో పని చేస్తూ -

న్నాడు. చాలా కాలం ఆఫీసులోనే పని చేసేవాడు ,కానీ -తర్వాత కాస్త డబ్బులు ఎక్కువ ఆదా చేయొచ్చన్న ఉద్దేశ్యం తో,ఆశతో ,సంసారాన్నీ,

అవసరమైన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ,’ఆడిట్ ‘పార్టీ లో పోస్టింగ్ 

వేయించుకున్నాడు. అలా ,ఆడిట్ కోసం బయటకు వెళితే ,పది -పదిహే-

ను ,రోజులకి గానీ  మళ్ళీ ఇంటి ముఖం చూసే అవకాశం ఉండదు. ఒక్కో -సారి,నెల రోజులు కూడా పట్టవచ్చు. 

ఉద్యోగస్థుడు అయిన తర్వాతనే,రాఘవరావు,తల్లి దండ్రుల అభీష్టం మేరకు ,వాళ్ళు ఎంపిక చేసిన లీలావతిని ,పెళ్లి చేసుకున్నాడు. లీలా-

వతి ,కూడా రాఘవరావు కు సమానంగా చదువుకున్నది. చాలా అంద-

గత్తె కూడా ! ఆమెకు కూడా ఉద్యోగం చేయాలనే కొండంత కోరిక ఉండేది. 

ప్రయత్నిస్తే ,తప్పక ఆమె చదువుకున్న చదువుకి ,మంచి ఉద్యోగమే వచ్చి ఉండేది. కానీ ,తన అందమైన భార్య ఆఫీసులో ఒకరికి సబార్డినేట్ 

గా,పని చేయడం రాఘవ రావు కి,సుతారమూ ఇష్టం లేదు !అందుకే ,

ఆమెను మొత్తం మీద మెస్మరైజ్ చేసి ,గృహిణిగా స్థిర పరచి,మళ్ళీఇంకెప్పుడూ ,ఉద్యోగం ప్రస్తావన రాకుండా చేయ గలిగాడు !అతని మనఃస్తత్వం పూర్తిగా అర్ధం చేసుకున్న ,లీలావతి కూడా గృహిణి గానే వుం

డి  పోవాలనే నిర్ణయానికి వచ్చింది. కానీ --ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటే,ఒక కోణంలో మంచి జీవితాన్ని అనుభవించ వచ్చు న న్నది,

ఆమె గత ఆలోచన. పైగా తాను కష్టపడడం భర్తకు ససేమిరా ఇష్టం లేక 

పోవడం తో ,మ ళ్ళీ ఎప్పుడు భర్త దగ్గర ఆ .. వూ సేత్త లేదు,లీల. 

 రాఘవరావు,లీలావతిల,సాంసారిక జీవితం,ఆనందంగా ,హా

యిగా ,గడిచి పోయింది ఫలితంగా వాళ్లకి,ఒకళ్ళ తరువాత ఒకరుగా,

ముగ్గురు ఆడపిల్లలు పుట్టుకొచ్చేశారు. నాల్గవ సంతానంగా,మగ పిల్ల 

వాడు,పుట్టడంతో,రాఘవరావు,ఇక కుటుంబ నియంత్రణను ఆశ్ర ఇంచక -

తప్ప లేదు. కాల చక్ర గమనం లో ,రోజు రోజుకి పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నట్టె ,అత

ని, ఉద్యోగంలో కూడా  పెనుమార్పులు వచ్చి,ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నాడు రాఘవరావు. ఆయన ఆఫీసులో ఉన్నత పదవిని 

అధిరోహించే సమయానికి,ఇంచుమించు నలుగురు పిల్లలు ,తమ ఉన్నత 

చదువులు పూర్తి చేసుకుని పెళ్లీడు కొచ్చేసారు. 

అలాగని ,రాఘవరావు పిల్లల కోసం పెళ్లి సంబంధాలు చూడడం లేదని -

అన లేము ,ఆయన పెళ్లి ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. కానీ,తాను 

తీసుకువచ్చిన ఏ ఒక్క సంబంధమూ ,భార్య లీలావతి కి ,నచ్చడం లేదు !

పిల్లలు విషయం తెలుసుకునే లోపులోనే ,సంబంధాలను వెనక్కు తిప్పేయడం జరుగుతోంది. అటు చూస్తే ఆడపిల్లల వయస్సు పెరిగిపోతోం-

ధీ. మరింత పెరిగీతే ,దక్కేది రెండో పెళ్లి వాల్లే !భార్య లీలావతి మాత్రం,మగ 

వాళ్లకి,ఈ దేశం గొడ్డు పోయిందా …. అన్న రీతిలో ,నిదానం ప్రధానం అన్న సూత్రాన్ని నమ్ముకుని కాలం గడుపుతోంది. మరి చేసేది ఏమీ లేక భార్యలో మార్పుకోసం,రాబోయే శుభ ఘడియ కోసం ఎదురు చూస్తున్నాడు రాఘవరావు. రకరకాల ఆలోచనలను మూటగట్టుకుని,వరంగల్ లో తన ఆడిట్ --

బృందాన్ని కలుసుకున్నాడు రాఘవ రావు. ఆడిట్ పనిలో పడితే ,మరి 

రెండో విషయం గుర్తు రాదు అతనికి. ఆ పని అలాంటిది మరి !


                    ****************


రాఘవరావు ,సీరియస్ గా తన పనిలో నిమగ్నమై ముఖ్యమైన ఆఫీసు విషయాలు చర్చిస్తున్న సమయంలో,తన మొబైల్ ఫోన్ శ్రావ్యంగా మోగడం మొదలు పెట్టింది. అవతల ఫోన్ చేస్తున్నది తన 

పెద్ద కూతురు స్వప్న అని గ్రహించి -----

‘’అమ్మా .. !ఏంటిరా ఈ వేళలో ఫోన్ చేసావ్ ‘’అన్నాడు రాఘవరావు ఆతృతగా. 

‘’ఎలా వున్నారు నాన్నా ?ఏమీలేదు … వూరికే ఫోన్ చేసాను,

మీరు ఎలా వున్నారో తెలుసుకుందామని !’’అంది కూల్ గా స్వప్న. 

‘’నాకేం … నేను బాగానే వున్నానమ్మా … అమ్మా ,మీరంతా బావున్నారు కదూ!మన మినీ గార్డెన్లో మొక్కలకి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తున్నారు కదూ … ‘’అన్నాడు రాఘవరావు,కూతురితో 

ఇంకేమి మాట్లాడాలో తెలీక. ‘’అందరం బావున్నాం నాన్నా … మొక్కల విషయంలో మీరు ఎలాంటి దిగులూ పెట్టుకోకండి,వాటి పని స్వయంగా నేను చూస్తానుగా. నాన్నా … మీరు ప్రయాణమై వెళ్ళీప్పుడు మీతో ఎదో 

చెప్పాలనుకున్నాను కదా !హా … అప్పుడు మర్చి పోయాను ,

ఇప్పుడు గుర్తుకు వచ్చింది. నాన్నా … మీ సూట్ కేసులో,బట్టల మధ్య లో,ఒక కవరు పెట్టాను,అందులో ఒక ఉత్తరం ఉంటుంది.మీరు ప్రశాంతంగా వున్నప్పుడు అది ఓపెన్ చేసి చదవండి,నాన్న’’

అంది సౌమ్యంగా స్వప్న. 

‘’ఉత్తరమా .. !ఏమిటమ్మా అది ?’’అన్నాడు కాస్త కంగారుగా. 

‘’ ఉత్తరమే నాన్నా … మీరు అనవసరంగా కంగారు పడి ,టెన్షన్  తెచ్చు కోకండి. మిమ్మలిని ఇబ్బంది పెట్టె అంశాలు అందులో ఏమీ 

వుండవు. నేను ఎప్పటినుండో మీతో కొన్ని విషయాలు చెప్పాలని 

అనుకుంటూ వచ్చా. కానీ మీతో ముఖా ముఖీ కలిసి చెప్పలేని 

పరిస్థితి. అందుకే ఉత్తరం రూపం లో మీ ముందుకు వచ్చాను.

సావధానంగా ఉత్తరం చదివి విషయాలు అర్ధం చేసు కుంటారని అను 

కుంటున్నాను.  పరిధులు దాటి ప్రవర్తించానని మీరు భావిస్తే నన్ను క్షమించండి నాన్న. వీలును బట్టి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను నాన్న’’

అని చెప్పి ,మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ,ఫోన్ పెట్టేసింది స్వప్న. 

రాఘవరావు,క్షణం ఉద్వేగానికి గురి అయ్యాడు. తర్వాత కాస్త కోలుకుని ,ఆలోచనలో పడ్డాడు. తన పిల్లలు గాని,ముఖ్యంగా పెద్ద-

కూతురు స్వప్న గానీ ,తనతో  ఎప్పుడూ ఎదిరించి మాట్లాడడం గానీ,తనకు ఇష్టంలేని పనులు చేయడంగానీ,మానసికంగా ఇబ్బంది 

పెట్టిన క్షణాలు గానీ,కానరావు. తండ్రికి చెప్పలేని విషయాలుంటే ,

తల్లికి చెప్పి ఆయా పనులు అయ్యేట్లు చూసుకునేవారు. పిల్లల మీద అంత గొప్ప నమ్మకం అతనికి !

అలాంటిది,ఏదో పెద్ద విషయం అయితే తప్ప,అంత సాహసం చేయదు. అయినా --ఉత్తరం రాయడం ఏమిటీ ?తాను ఇంట్లో ఉండగా చెప్పలేక,ఉత్తరం రాసిందంటే,అదేదో సీరియస్ మేటర్ అయి 

ఉండాలి !అలా పరి పరి విధాలా ఆలోచనల్లో పడ్డ,రాఘవరావు బుర్ర స్థాయికి మించి వేడెక్కిపోయింది. ఫైల్స్ పేరుకు మాత్రమే చూస్తున్న

డు గానీ,అతని కి ఏమీ కనపడ్డం లేదు,తాను చేస్తున్న పని మీద 

ఏకాగ్రత సన్నగిల్లింది. విప్పిన ఫైళ్లు అన్నీ మూసేయడం మొదలు 

పెట్టాడు. తన కొలీగ్స్ కి ఒక మాట చెప్పి ,వ డి .. వడి .. గా,తన 

హోటల్ రూముకు చేరుకున్నాడు రాఘవరావు. 


                      **********************



హడావిడిగా హోటల్ కు చేరుకున్న రాఘవరావు ,త్వర త్వరగా స్నానం చేసి,ఫ్రెష్ అయినా తర్వాత ,సూట్కేస్ తెచ్చి మంచం మీద 

పెట్టుకుని,బట్టల మధ్యలో తన కూతురు స్వప్న,పెట్టిన ఉత్తరం కోసం ,వెతకడం మొదలు పెట్టాడు. ఒక చొక్కా జేబులో,భద్రంగా ఉంచిన,కవరు తీసి,జాగ్రత్తగా విప్పి,భయం .. భయం .. గా,ఉత్తరం 

చదవడం మొదలు పెట్టాడు రాఘవరావు. ఊహించని రీతిలో అతని 

చేతలు వణకడం మొదలుపెట్టాయి. ఒక క్షణం ఆగి,కాస్త తమాయించుకుని,తిరిగి ఉత్తరం చదవడం మొదలు పెట్టాడు ,రాఘ

వ రావు.. 


‘’ప్రియమైన నాన్నగారూ .. ,

ఉభయకుశలోపరి. నాన్నా … నేను మీకు ఇలా ఉత్తరం రాస్తానని 

గానీ,రాయవలసి వస్తుందని గానీ,నేను ఈ ఉత్తరం మొదలు పెట్టేవరకూ అనుకోలేదు. కానీ,పరిస్థితులు,జీవితంతో,-వింత .. వింత 

సంఘటనలతో,సన్నివేశాలతో,ఆడుకుంటున్నప్పుడు,మరో గత్యంతరం లేక,ఈ ప్రక్రియను ఆశ్రయించవలసి వచ్చింది. నాకూ తెలుసు,మీరూ అనుకుంటారని,’ఎన్నడూ లేనిది నా కూతరు నాతో 

ముఖా ముఖీ మాట్లాడకుండా,ఇలా ఉత్తరం రాసిందేమిటి ఇలా’అని. 

 ఏమి చేయమంటారు నాన్నా,మీ ఆదర్శ పెంపకం,క్రమశిక్షణ,

మమ్ములను ఇంట్లో ఇలా ,బందీలు మాదిరిగా,మార్చి,నోరు విప్పలేని మూగవాళ్ళుగా మార్చి వేసింది. మీరు టెన్షన్ పడకూడదు,మీకు ఇబ్బంది కలుగకూడదు,మీరు బాధ పడకూడదు,... ఇదే కదా నాన్నా మా ద్యేయం. 

మమ్ములను కనీ,ఎవరూ పెంచనంత గారాబంగా పెంచి ,మాకు 

కావలసినవన్నీ,లేదనకుండా సమకూర్చారు. మంచి చదువులు 

చెప్పించారు ,ఎందుకు నాన్నా .. మమ్మల్ని అంత శ్రమకోర్చి చదివించారు ?అంత పెద్ద చదువులు చదువుకుని ఇంట్లో ఘోషా -

పాటించడానికా !ఉద్యోగం సద్యోగం లేకుండా ,మీ తర్వాత మేము 

ఎలా బ్రతకాలి నాన్నా. ఎవరు మమ్మలిని పెంచి పోషిస్తారు ?

నాన్నా …. !,ఏకూతురు ,తన తల్లిదండ్రులిని ‘నాకు పెళ్లి చేయండని

అడుగదు ,కానీ -నీ కూతురు యిప్పుడు అడుగుతోంది,నాకు ఎలాగూ పెళ్లీడు దాటిపోయింది ,ఫరవాలేదు. కానీ,చెల్లెళ్ళకీ ,తమ్ము

డీకే కూడా పెళ్లీడు వచ్చేసింది ,వాళ్ళ పెళ్లి గురించైనా కాస్త మనసుపెట్టి ఆలోచించండి నాన్నా. 

నన్ను గురించి నేను ఆలోచించుకుంటూనే,నా చెల్లెళ్ళ గురించి ,

తమ్ముడి గురించి,ఆలోచన చేస్తుంటే,గుండె చేరువైపోతుంది నాన్నా. 

మిమ్మలిని బాధపెట్టడం నా ఉద్దేశ్యం కానేకాదు ,కానీ,.. మమ్మీ.. మీరు ఏమి ప్లానింగ్ చేస్తున్నారన్నది అసలు అర్ధం కావడం లేదు. అయినా మాకు బాధలేదు,కానీ .. మా విషయంలో బయటివాళ్ళు 

మిమ్ములను అంటున్న మాటలు వినలేకపోతున్నాం నాన్నా. అది పెద్ద చిత్ర హింస అయిపొయింది మాకు. 

నాకు బాగా తెలుసు,మీరు ఎప్పుడూ మా బాగు గురించే ,ఆలోచిస్తా

ర నీ,కష్ట పడుతున్నారనీను ! కానీ సమయం మనకోసం ఆగిపోదు కదా నాన్నా !సమయం మించిపోయాక మీ దగ్గర ఎంత డబ్బున్నా 

ఉపయోగం ఉండదు. 

ఇప్పటివరకూ మీరు చెప్పినట్టే విన్నాం కదా నాన్న. మీకు అనవసర సమస్యలు సృష్టించకూడదని ,ప్రేమ -దోమ ,అనే పదాలను ఎప్పుడో మరచిపోయాం. రైల్లో ప్రయాణించినా,బస్సులో 

ప్రయాణించినా,రోడ్డు మీద నడిచినా,పరాయి మగాళ్ల వంక కన్నెత్తి కూడా చూసి ఎరుగము. ఎవరైనా మమ్ములను,కామెంట్ చేసినా మీరు ఊరుకోలేదు. మీ డిసిప్లిన్ అలాంటిది కదా !

నాన్నా ,మీరు మాకు చెబుతుండేవారు,మీ పెళ్లి విషయంలో,తాత-

గారు,మిమ్ములను ఎంత ఇబంది పెట్టారో !మా విషయంలో కనీసం అదైనా గుర్తుకు రావడం లేదా నాన్నా !

 మా పెళ్లిళ్ల విషయంలో మీరు ఏదో ఒక ఫార్ములా పెట్టుకుంటారు,కానీ,మీకు నచ్చిన అబ్బాయి ,మమ్మీ కి నచ్చ డు ,మమ్మీకి నచ్చిన ,అబ్బాయి మీకు నచ్చదు,మరి,మాకూ .. కొన్ని,కోరికలు ,ఆశలు వుంటాయని,మా అభిప్రాయం కూడా తీసుకోవాలనీ మీకు అసలు తెలీదా ?మీ అభిరుచుల మేరకు,బంధువులకు దూరంగా,సంస్కృతీ సంప్రదాయాలకు,సమాజానికీ దూరంగా ఇలా ఎంతకాలం ఉండాలి నాన్నా?

మీకు ఇలా ఉత్తరం రాస్తున్నందుకు,ఎంత భయపడుతున్నానో,ఎంత సిగ్గు పడుతున్నానో తెలుసా నాన్నా. మీరు వీక్ ఎండ్ లో ఇంటికి వచ్చినప్పుడు ,తిరిగి మళ్ళీ మీ ముఖం చూడగలనా నేను ?

అయినా తప్పడం లేదు. చెల్లెళ్ళ గురించి,తమ్ముడి గురించి,తీవ్రంగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. మీ పెంపకంలో,ఇది నాకు పెద్ద 

సాహసమే !అయినా ,పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని,ఇలా 

బరి తెగించాను. 

నాన్నా --నేను పెద్దదానిగా బాధ్యత మరచి,బరువంతా మీ మీద మోపి,

నేను ఏదో అయిపోతానని ఖంగారు పడకండి. అంత పిరికి ఆలోచనలు 

నాకు లేవు !నేను బ్రతికినంత కాలం,మీ సంరక్షణలో మీకు గొడుగై,

మీకు వెన్నంటి వుంటాను నాన్న. దయచేసి ఇప్పటికన్నా మమ్మీ -మీరు 

ఒక్క మాటగా నిలిచి,మంచి నిర్ణయాలు తీసుకోండి నాన్న. ప్లీజ్ .. ఇలా 

రాసినందుకు నన్ను మన్నించరూ … !!----ప్రేమతో ---స్వప్న ‘’


 ఉత్తరం ముగించేసరికి,అతనికి ముచ్చెమటలు పోశాయి. అతని,

గుండె ద్రవించిపోయింది. తెలీకుండానే,కన్నీరు వరదలై పారింది. కొద్దీ 

క్షణాలు ఆ .. భయంకర పరిస్థితిని తట్టుకుని,,ఒక గట్టి నిర్ణయానికి వచ్చాడు రాఘవరావు. వెంటనే పరిస్థితినుంచి తేరుకుని,మొబైల్ తీసుకుని,కూతురికి డయల్ చేసి ---’’అమ్మా .. !నేను వస్తున్నా . ‘’అని,

మరోమాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాడు

రాఘవరావు. 



* పాలపిట్ట కథా సంకలనంలో ,ముద్రితము.*


----డా.కె.ఎల్.వి.ప్రసాద్

హన్మ కొండ.

1 view0 comments

Recent Posts

See All

పరిష్కారం ..!! ( పిల్లల కథ )

శేఖర్ బా బు ... చాల బొద్దుగా అందంగా ఉంటాడు.పెళ్లిఅయిన పది సంవత్సరాలకు ,ఆనంద్ -శ్రీలేఖలకు పుట్టిన విలువైన సంతా నం ,శేఖర్ బాబు .తల్లిదండ్రులకు గారాల బిడ్డ .ఇంట్లోఅందరికీ అతడొక జీవమున్న ఆటవస్తువు అయిపోయా

అపరిచితుడు ..!! (కథ)

మధ్యాహ్నం 11గం. లు ,అయి ఉంటుంది. ఔట్ పేషేంట్ డిపార్ట్మెంట్ లో ,పేషేంట్స్ ను చూడ్డం పూర్తి కావడంతో,బ్రీఫ్ కేస్ లోఉన్న వారపత్రిక తీశాను,ఓసారి శీర్షికలు చూద్దామని.నిజానికి అంత సమయం రోజూ దొరకదు,కానీ ఆ రోజ

   తిక -మక !! (చిన్న -హాస్య కథ)

కరోనా కాలం ఇది . అయినా ,అక్కడ జనసందోహం బాగానే వుంది . కొందరు సగం మూతికి మాస్కు పెట్టుకుంటే ,కొందరు మాస్కును మేడలో వెళ్లాడ దీసుకున్నారు మూర్ఛ రోగుల్లా . అక్కడ ఎవరూ స్థిమితంగా ఒకే చోట కూర్చోలేక పోతున్నా

Post: Blog2 Post
bottom of page