top of page

   తిక -మక !! (చిన్న -హాస్య కథ)

Writer's picture: కె.ఎల్.వి.కె.ఎల్.వి.

కరోనా కాలం ఇది . 

అయినా ,అక్కడ జనసందోహం బాగానే వుంది . కొందరు సగం మూతికి మాస్కు పెట్టుకుంటే ,కొందరు మాస్కును మేడలో వెళ్లాడ దీసుకున్నారు 

మూర్ఛ రోగుల్లా . అక్కడ ఎవరూ స్థిమితంగా ఒకే చోట కూర్చోలేక పోతున్నారు ,నిలబడలేక పోతున్నారు . తమ వంతు కోసం తలుపు వైపు ఆత్రంగా చూస్తున్నారు . 

ఇంతకీ ఆప్రదేశం గురించి చెప్పలేదు కదూ !అదో పేరుపడ్డ చర్మ వ్యాధుల ఆసుపత్రి . వూళ్ళో ఎంతమంది చర్మ వ్యాధి వైద్య నిపుణులు వున్నా ,

జనం మాత్రం ఆ .. ‘ గోకా .. చర్మవ్యాధుల ఆసుపత్రి ‘కె ,వెళతారు . దురద పెడితే ఎంతసేపైనా గోక్కుంటూ క్యూలో కూచుంటారు గానీ ,ఖాళీగా 

వుండే వేరే డాక్టరు దగ్గర చూపించుకోరు . 

ముఖం మీద మొటిమలు చిదుముకుంటూ కొందరు ,తల గోక్కుంటూ కొందరూ ,వీపు బరుక్కుంటూ కొందరూ ,ముఖం మీద మచ్చలుగోక్కుం

టూ ,పబ్లిక్ గా గోక్కునే అవకాశం లేని ప్రేదేశాల్లో ,గోక్కునే ప్రయత్నం చేస్తూ అష్టకష్టాలు పడుతున్న ,ఆడపడుచులు ,మగమహారాజులతో అక్కడ సన్నివేశం వింతగా ,బాధాకరంగా ,వుంది . 

కరోనా కారణంగా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్న నేపథ్యంలో ,ఒక్కొక్క కేసు పరీక్ష చేసి మందులు రాయడానికి ,డాక్టరుగారికి ,చాలా టైం పడుతోంది . 

ఇలా ఎవరి బాధల్లో వాళ్ళు ,నాటకంలో పాత్రల్లా ,తమ సమస్యలను తాము ,తమకు తెలిసిన రూపంలో ప్రదర్శిస్తున్నారు . 

ఇంతలో ,అక్కడున్న వారు అంతా ఉలిక్కి పడేలా ,డబ్భై ఏళ్ళ వ్యక్తి గొణుక్కుంటూ ,చేతిలోవున్న స్కెలు లాంటి కర్ర బద్దతో వీపు గోక్కుంటూ ,

ఏమాత్రం సిగ్గు పడకుండా ,అవసరమైన అన్ని చోట్ల ,విపరీతంగా గోక్కుంటూ ,వాళ్లందరిమధ్య ,కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ గేటు దగ్గర వున్నకంపౌండర్ కు ,దండాలు పెడుతూ ,తనను త్వరగా లోపలికి పంపమని వేడుకుంటున్నాడు . అందరి ఆమోదం పొందిన తర్వాత ,ఆ ముసలాయన్ని ,లోపలి కి డాక్టరు దగ్గరికి పంపించాడు కాంపౌండర్ . 

తక్కువ మాట్లాడడం ,ఎక్కువ మందులు ,రాసె అలవాటు వున్న,ఆ డాక్టరు ఏమిటన్నట్టు మూఖాభినయం చేసాడు ,ముసలాయన్ని చూసిన 

డాక్టర్ గారు . 

‘’ డాక్టర్ గారూ .. నెల రోజుల క్రితం వచ్చాను ,వళ్ళంతా దద్దుర్లు -గోకుడు అని . తమరు కొన్ని గోళీలు ,ఈ టానిక్కూ రాసిచ్చారు . ఒకటి తాగితే తగ్గలేదని ,ఇంకో సీసా కొనుక్కుని తాగాను ,ఈ లోగా .. లాక్ డౌన్ వచ్చింది . నా బాధ ఎక్కువయింది డాక్టర్ సాబ్ !’’ అన్నాడు అమాయకం

గా . అతని దగ్గర మందుల చీటీ చూసి .. తలపట్టుకున్నాడు డాక్టర్ . అతనే మూర్ఛవచ్చి పడిపోతాడేమోనన్న అనుమానం వచ్చింది ,ఆ పేషేంటుకీ ,గేటు దగ్గర కాంపౌండర్ కీను !

సంగతేమిటంటే ,డాక్టర్ రాసిన చర్మపు లోషన్ టానిక్ అనుకునే తాగేశాడు 

ఇన్నాళ్లు ,ముసలాయన , డాక్టర్ తేరుకోడానికి చాలా సమయం పట్టింది. 


                         * సమాప్తం *           


----డా.కె.ఎల్.వి.ప్రసాద్

హన్మకొండ.       

Recent Posts

See All

పరిష్కారం ..!! ( పిల్లల కథ )

శేఖర్ బా బు ... చాల బొద్దుగా అందంగా ఉంటాడు.పెళ్లిఅయిన పది సంవత్సరాలకు ,ఆనంద్ -శ్రీలేఖలకు పుట్టిన విలువైన సంతా నం ,శేఖర్ బాబు...

అపరిచితుడు ..!! (కథ)

మధ్యాహ్నం 11గం. లు ,అయి ఉంటుంది. ఔట్ పేషేంట్ డిపార్ట్మెంట్ లో ,పేషేంట్స్ ను చూడ్డం పూర్తి కావడంతో,బ్రీఫ్ కేస్ లోఉన్న వారపత్రిక...

నాన్నా ..పెళ్లి చేయవూ ..!! (కథ)

‘’నాన్నా … ‘’అని ,పిలిచింది స్వప్న . ‘’ఏమిటమ్మా …. ‘’అన్నాడు అప్పటికే కిందికి మెట్లు దిగి బయటికి వేళ్ళ బోతున్న ,స్వప్న తండ్రి రాఘవరావు....

Comments


Post: Blog2 Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook

*గమనిక* 
ఈ..సాహిత్య సంపద నా స్వంతం. ఇతరులు ఎవరూ, ఏ అంశాన్ని నా అనుమతి లేకుండా  ఏ విధంగా ను ఉపయోగించ రాదు.అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 
 -----డాక్టర్. కె.ఎల్. వి.ప్రసాద్. రచయిత.

Copyright ©2021 klvsahityam by KLV Prasad. All rights reserved

bottom of page