క్యాబ్ బయలుదేరి పది నిముషాలు కావచ్చు.
హైదరాబాద్ లో,మెహిదీపట్నం-లింగం పల్లి ,రోడ్డులో క్యాబ్ క్రమంగా వేగం పుంజుకుంటోంది . డ్రైవర్ నావిగేటర్ సహాయంతో తాను వెళ్ళవలసిన మార్గం లో,తాపీగా డ్రైవ్ చేసుకుంటూ -
పోతున్నాడు . ఇప్పుడు హైదరాబాద్ లో,ఆటోలు,టాక్సీల గొడవ తగ్గి క్యాబ్ ల యుగం
ప్రారంభమై ,ఎక్కడికి వెళ్లాలన్నా ప్రయాణికులకు ,ప్రయాణం ఎంతో సులభం అయిపోయింది .
సరైన చిరునామా చెప్పగలిగితే ,కనీస మొబైల్ పరిజ్ఞానం కలిగి ఉంటే,మనం చేరుకోవాల్సిన
గమ్యస్థానం దగ్గరకి, కరెక్టుగా చేరుకునే సౌలభ్యం ఏర్పడిపోయిందిప్పుడు . అందుకే కాస్త
దూరమైనా కూడా,ఖర్చు గురించి ఆలోచించకుండా ,క్యాబ్ బుక్ చేసుకున్నాడు మణి కుమార్
మణికుమార్ , హైదరాబాద్ నగరం లో ఒక ప్రైవేట్ బాంక్ లో ఉన్నతోద్యోగి . యాభయి -
ఏళ్ళ పైబడిన వయసున్నా ,అందంగా ఆకర్షణీయంగా వుండి చూడ్డానికి వయసులో చిన్న--
వాడిలా కనిపిస్తాడు . చూపులతోనే కాదు ,మాటలతో సైతం,ఎలాంటివారినైనా యిట్టె ఆకర్షించ గల వ్యక్తిత్వం మణిది . అతను కాచిగూడ దగ్గర ,చాపెల్ బాజార్ లోని,కూబ్దీ గూడ లో ,అద్దె
ఇంటిలో కాపురం ఉంటున్నాడు .
అతనికి చదువుకున్న అందమైన భార్య,రత్నాల్లాంటి ఇద్దరు చిన్న పిల్లలు వున్నారు . పిల్లలు
ఇంకా చిన్నవాళ్ళే కనుక దగ్గరలోని బడిలో చదూకుంటున్నారు . భార్య సుమతి,హైదరాబాద్ లోనే ,ఒకానొక ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్ గా పని చేస్తోంది .
రోడ్డు మీద క్యాబ్ గమ్య స్థానం చేరుకునే దిశలో,స్పీడ్ గా ముందుకు పరిగెడుతోంది . దానికి
మించిన స్పీడ్ లో ,మణి బుర్ర పని చేస్తోంది . చేరుకోవాల్సిన ప్రదేశం దగ్గర అవుతున్నకొద్దీ,
అతని ఆలోచనలు పరి పరి విధాల రూపాంతరం చెందుతున్నాయ్ . తాను చేయబోతున్న
పని, తనకు-తన సంసారిక జీవితానికీ,మచ్చ తెచ్చేదిగా అనిపించినా, అతని వయస్సు -మనస్సు,దానిని త్రోసి రాజ ని,ప్రస్తుత నిర్ణయానికే ప్రాధాన్యత నివ్వ వలసి వచ్చింది . తాను
తీసుకున్న నిర్ణయం ,మంచిదా?చెడ్డదా ? అని ఆలోచించే శక్తిని అవతలి శక్తి డామినేట్
చేయడం మొదలు పెట్టడం తో, మణి అక్కడికి వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు . భార్యకు ఎలా చెప్పాలో,ఏమి చెప్పాలో తెలీక బాంకు పనిమీద లింగం పెళ్లికి వెళుతున్నట్లు ,అందమైన
అబద్దం నిర్భయంగా చెప్పేసి ఆమెను నమ్మించేసాడు మణి . నిజానికి వాళ్ళిద్దరిదీ ప్రేమ వివాహ మే ! డిగ్రీ చదువుకునేటప్పుడు ఒక చిన్న సంఘటనతో పరిచయం ఏర్పడి ,అది క్రమంగా ప్రేమ లోనికి దారితీయడం తో ,వాళ్ళ అదృష్టం బాగుండి ,కులం,మతం,ప్రాంతం వంటి
అంశాలు ,వాళ్ళిద్దరికీ అనుకూలంగా మారడంతో,ఇరువైపులనుండి,వారి .. వారి .. తల్లిదండ్రుల
ను, ఒప్పించే విషయంలో వాళ్లకి పెద్ద సమస్యగా మారలేదు !
అందుచేతనే ,భర్త మణిని గానీ,భర్త చేసే పనులను గానీ,తాను గాఢంగా నమ్ముతుంది . అసలు
అతనిని ,ఏ విషయంలోనూ అనుమానించే అవసరం గానీ, అవకాశం గానీ ,రాదు ..ఇప్పటి-
వరకు రాలేదు కూడా ! భార్య విషయంలో మణి పరిస్థితి కూడా ఇంచుమించు అంతే !భార్యను
2-----
అమితంగా ప్రేమించడమే కాదు,విశ్వసిస్తాడు కూడా . తాను చేసి పని ఎంతటి చిన్నదైనా,భార్య
కు,చెప్పకుండా చేయడు . ముఖ్యంగా భార్యను నొప్పించే పనులు చేయడానికి అతను ఎప్పుడు సాహసం చేసి ఎరుగ డు . కానీ,ఇప్పుడు కేవలం తన స్వార్ధం కోసం పచ్చి అబద్దం
చెప్పి ఆమెను నమ్మించాల్సి వచ్చింది . ఒక్కటి మాత్రం నిజం,తాను తెలిసి తప్పు చేస్తున్నా,
ప్రస్తుత పరిస్థితి లో,దానిగురించి విశ్లేషణగా,ఆలోచించే పరిస్థితిలో లేదు మణి . దీనంతటికీ
అసలు కారణం అశ్వని .
--------------------------------------------------------------------------------------------------------
అశ్విని ,అందమైన మహిళ. ఉత్తమ లక్షణాలున్న గృహిణి . ఆమె అసలు వయసు నలభై ఏళ్ళు వున్నా,ముప్పై ఏళ్ళ అమ్మాయి అంటే ఎవరైనా నమ్ముతారు . మంచి-మర్యాద,బంధు
వులు-స్నేహితులు,అంటే ఆమెకు యెనలేని మక్కువ. ఈ తరం స్త్రీలతో పోలిస్తే,ఆమెకు సాటి
ఐన గృహిణులు ఇప్పటి మన సమాజంలో కనిపించరు !
ఆచార వ్యవహారాల విషయానికొస్తే,అన్ని కులాలకు,అన్ని మతాలకు సంభందించిన అంశాలు
ఆమెకు కొట్టిన పిండి .
భర్త రమణ మూర్తి ,యూనివర్సిటీలో కామర్స్ ప్రొఫెసర్ . మంచి కలుపుగోలు మనిషి . స్నేహానికి,బంధుత్వాలకు,సమయం వస్తే ప్రాణం పెట్టె మనిషి . మంచి ప్రొఫెసర్ గానే కాకుండా ,
ఒక సహృదయుడిగా,సంఘ సేవకుడిగా,సమాజంలో అతనికి మంచి గుర్తింపు ఉంది .
స్నేహితులతోను,బంధువులతోను ,శ్రేయోభిలాషులతోను,వాళ్ళ ఇల్లు,ఎప్పుడు ,నిత్యకళ్యా-
ణం ,పచ్చ తోరణం మాదిరిగా ఉంటుంది .
వంటా-వార్పూ విషయంలో ,ఎంత పని వత్తిడి పడ్డా, సంతోషంగా,ఇష్టంగా ,వండిపెడుతుంది అశ్విని . తమ సంతానం ఇద్దరు ఆడపిల్లలు చదువు పేరుతో ,కెనడా దేశంలో ఉండడం వ ల్ల,
ప్రతి ఇంటిలో మాదిరిగానే ,చివరికి ఇంట్లో ఇద్దరే మిగిలారు . దీనికి తోడు ,భర్త ప్రతిరోజూ
సెమినార్ అనో,మీటింగ్ అనో,ఉదయం ఇంటినుండి బయటపడి ,రాత్రి తొమ్మిది దాటితేనే గాని
ఇంటికి చేరుకోడు . ఈ నేపథ్యంలో అశ్వని ఇంచుమించు వంటరి జీవితం గడుపుతోంది . అనుభ
వించడానికి ,ఆమెకు అన్నీ అందుబాటులో వున్నా ,చెప్పుకోలేని వెలితి ఆమెను నిత్యం వెంటా దుతూనే వుంది . ఖాళీ సమయం అంతా ,పుస్తకాలతోనో ,మొబైల్ తోనో కాలక్షేపం చేయడం అలవాటు చేసుకుంది .
కామర్స్ లో ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అశ్వినికి,ఇంచుమించు అన్ని కళలలోనూ ,ప్రవేశము
ప్రావీణ్యము వున్నాయ్ . పండగలకు ,పబ్బాలకు ,ఎప్పుడు ఎక్కడ ,ముగ్గుల పోటీలు జరిగినా
ఆమె ప్రధమ స్థానంలో నిలవాల్సిందే !బొమ్మలకొలువు పెట్టడం లోను,పైంటింగు లు వేసి ఇంటిని అలంకరించడంలోనూ,ఆమెకు గొప్ప ప్రావీణ్యం వుంది . ఆమె బట్టలు ,ఆమె స్వయంగా
కుట్టుకుంటుంది . ఆమె డ్రెస్సులకు ,ఆమెనే డిజైనర్ !అలాగే చిన్న చిన్న కవితలు కూడా
3-------
రాస్తుంది . అదిగో ,ఆ … కవితలే మణిని -అశ్వినిని విడదీయలేనంత మంచి స్నేహితులుగా మార్చాయి .
ఒకసారి అనుకోని రీతిలో ,అశ్వని కవిత ‘వాట్స్ అప్ ‘లో,చదివే అవకాశం మణికి కలిగింది ముందు ,ఆమె కవితకు ‘లైకు ‘కొట్టి , కవిత్వం రాయడం కొనసాగించమని ,కామెంట్ పెట్టాడు .
అతని కామెంట్ తో అశ్వని ,ఎగిరి గంతేసినంత పని చేసింది . అంటే,రోజుకొక్క కవిత చొప్పున రాసి ,వాట్స్ అప్ లో పెట్టడం మొదలు పెట్టింది . ఆమె కవితలకు విపరీతంగా స్పందించిన మణి ,ఆమెను ప్రోత్సహిస్తూనే,ఆమె స్వంత విషయాలు తెలుసుకోవడం మొదలు పెట్టాడు .
పలకరింపులో . ‘మీరు ‘కాస్తా ,’నువ్వు ‘కు రూపాంతరం చెందింది . గతంలో ఎంతో మంది ఇలా
స్నేహితులైనవాళ్ళే గానీ,ఎవరూ మణి మాదిరిగా,ప్రోత్సహించక పోవడంతో ,మణి పట్ల,అశ్వని
కి,విపరీతమైన నమ్మకం ఏర్పడింది . మరొక పక్క అతని పట్ల చెప్పలేనంత మోజు కూడా పెరి
గింది .
అంతేకాకుండా,నిజ జీవితం లో ,ఆమె ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలకు,అతను కొన్ని పరిష్కార మార్గాలు చూపించ గలిగాడు . అంతే …. అలా,వాళ్ళిద్దరి స్నేహం ,మూడో కంటికి తె లియకుండా,మూడు పువ్వులు-ముప్పై కాయలుగా ,దిన దిన ప్రవర్ధమానం కావ-
డం మొదలు పెట్టింది . ఈ నేపథ్యం లో ఓసారి,అశ్వినిని కలవాలనుకున్నాడు మణి. అంతే,
పచ్చ జండా ఊపేసింది అశ్విని .
నిత్యం ,బంధువులతో,స్నేహితులతో,నిండి వుండే ఆ .. ఇంట్లో ‘ప్రైవసీ ‘దొరికే అవకాశం లేదు .
హోటళ్లలోనూ,పార్కుల్లోనూ ,కలుసుకోవడం వాళ్లకి అసలు ఇష్టం లేదు అందుకే,అవకాశం
వచ్చేవరకు ,ఎదురు చూసి అశ్విని ఇంట్లోనే కలవాలనుకున్నారు వాళ్లిద్దరూ . వాళ్ళ అదృష్టం
కొద్దీ,ఫ్రొఫెసర్ రమణ కు,ఢిల్లీలో ఒక ముఖ్యమైన కాన్ఫరెన్స్ కు ,ప్రభుత్వం నుండి సిఫారసు రావడం తో,ఆయన తప్పనిసరిగా దేశ రాజధానికి ,వెళ్ళవలసి రావడంతో,అశ్విని-మణి,కలుసు
కునే సన్నివేశానికి ,మార్గం సుగమం అయింది .
‘’సార్,... మనం ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ,మెయిన్ గేట్ దగ్గర వున్నాం ‘’అని
గుర్తు చేసాడు ,క్యాబ్ డ్రైవర్ . ఆలోచనల్లో పీకల్లోతు మునిగిపోయివున్న మణికుమార్ ,ఒక్క
సారిగా ఉలిక్కి పడి ,
‘’అవునా,.. అయితే ఇక్కడ ఒక్క క్షణం ఆపవయ్యా,కరెక్టు అడ్రసు తెలుసుకుందాం ‘’అన్నాడు
మణి . నిజానికి, అతను క్యాబ్ బుక్ చేసింది అంతవరకే !
క్యాబ్ మెయిన్ గేట్ దగ్గర ఆగింది . మణి ,అశ్వినికి ఫోన్ చేసి మొబైల్ డ్రైవర్ చేతికి అందించా-
డు . అశ్విని నుంచి కరెక్టు చిరునామా తెలుసుకున్నాక,క్యాబ్ బయలుదేరి ,కొద్దీ నిముషాల్లోనే
శేరిలింగంపల్లి ,రోడ్ నం . 3,లో ఒక అందమైన భవంతి ముందు ఆగింది . అప్పటికే అశ్విని,గేట్
4---
దగ్గర నిలబడి,మణి ప్రయాణిస్తున్న క్యాబ్ కోసం ఆత్రుతతో ఎదురు చూస్తోంది . క్యాబ్ డ్రైవర్ కి,
డబ్బులిచ్చి పంపేశాడు మణికుమార్ .
*** **** ****
మణి ,నవ్వుతు అశ్వినిని సమీపించాడు . వాళ్లిద్దరూ ప్రత్యక్షంగా ఒకరినొకరు కలుసుకోడం ఇదే
మొదటి సారి !అందుకే ,అతనిలో చొరవ అంత అడ్వాన్సు కాలేదు . అశ్విని మాత్రం,గబుక్కున
మణిచేయి అందుకుని,అతని చేతి మీద ముద్దు పెట్టి,ముందుకు నడిచింది . మణి ,ఆమెను
అనుసరించాడు . ఇంట్లోకి వెళ్ళడానికి ,మెట్లు ఎక్కబోతుంటే,వాచ్ మెన్ మెన్ ఎదురై ,నవ్వు
తూ … ‘’అమ్మా .. ,సారూ,తమరి అన్నయ్యగారా ‘’అన్నాడు,నెత్తి గోక్కుంటూ .
‘’ఆహా ..,!మా ,పెద్ద మేనమామ ‘’అంది నవ్వుతూ .
ఇంట్లోకి అడుగు పెట్టగానే,ఇల్లంతా ఒకసారి కలయజూసాడతను . అక్కడి వాతావరణం చాలా
రిచ్ గా అనిపించింది మణికి . హాల్ చాలా అందంగా అలంకరించబడి వుంది . అక్కడక్కడా గోడ
కు, ఆకర్షణీయమైన పెయింటింగ్స్ వ్రేలాడుతున్నాయ్ .
హాల్లోకి అడుగు పెట్టగానే,కవి ,దాశరధి రాసిన,’గాలిబ్ గీతాలు’కోసం ,ప్రసిద్ధ చిత్రకారుడు బాపు
వేసినచక్కని శృంగారచిత్రాలు,అతనికానుచూపునుఆకట్టుకున్నాయి. నవాబులనాటి పురాతన మోడల్ ఫర్నిచర్ తో,ఇల్లంతా ఆధునికంగా అమర్చబడి వుంది. ఆభార్యాభర్తల కళాభిరుచికి నివ్వెరపోయాడు మణి !
అలాంటి శృంగారభరిత వాతావరణం వున్న ఆ..అందమైన హాల్లో, తాను అశ్వినితో ఊహించు-
కుంటున్నాడు మణి. తనకు ఎదురుగా ,దివినుండి భువికి దిగివచ్చిన అప్సరసలా అశ్విని,
వెలిగిపోతోంది.ఆమెను అలాగే నఖశిఖ పర్యంతం చూస్తూ నిలబడిపోయాడు మణి .
‘’ఏంటీ..అదేపనిగా చూస్తున్నారు, ఎప్పుడు అసలు ఆడపిల్లముఖం చూడనట్టు’’ అంది,
మూసి మూసి నవ్వులు నవ్వుతూ అశ్విని.
‘’ఆ.అదే, మీఇల్లు చాలాకళాత్మకంగా బావుంది, అందుకే,నీఅభిరుచిని అంచనా వేసుకుంటూన్నాను’’అన్నాడు,అదే పద్ధతిలో మణి .
‘’ఓహో..,ఇల్లు మాత్రమే బాగుందన్నమాట! అయితే ఇంటిఇల్లాలు బాగోలేనట్లేగా!!’’
అందికాస్త కవ్వింపుగా.
‘’అయ్యో, ఎంతమాట! నీఅందం తర్వాతే ఇవన్నీ.నేనే గనక గొప్ప రొమాంటిక్ కవిని అయి
ఉంటే, ఈపాటికి ,నీగురించి ఓ..వెయ్యి పేజీల శృంగారకావ్యం రాసిఉండేవాడిని!’’అన్నాడు
మనఃస్ఫూర్తిగా నవ్వుతూ మణి .
‘’అబ్బో!! నాకు కవిత్వం,కాకరకాయలు,అక్కరలేదులెండి,మీహృదయంలో ,స్నేహితురాలిగా
పిసరంత అభిమానం ఉంటే చాలు నాకు’’, అంది జారిపోతున్న పైట సరిచేసుకుంటూ.
‘’అభిమానం కాదు అశ్విని, ‘ప్రేమ’.!!,నాగుండెలనిండా ,నువ్వే నిండిపోయి వున్నావు. నీ
5---
పరిచయం అయ్యాక, నీ గురించి తెలుసుకున్నాక నీ మనఃస్తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసు కున్నాక,నీ మనస్సులో నువ్ నాకు ఇచ్చిన స్థానాన్ని అర్ధం చేసుకుని ,నిన్ను ఎప్పుడు
చూద్దామా !అన్న ఆత్రుతతతో ఇంత కాలం ఎదురు చూసాను . అది ఇప్పటికి నిజం
అయింది ‘’అన్నాడు ,ప్రేమగా .
‘’ఇలా నిలబడి కబుర్లతో కాలక్షేపం చేసేస్తారా ఏమిటి ! అలా .. ఆ సోఫాలో కూర్చోండి . ఇప్పుడే
మనిద్దరికీ, ఫిల్టర్ కాఫీ కలుపుకొస్తాను . ‘’అని ,వంట గదిలోకి వయ్యారంగా నడిచి వెళ్ళింది
అశ్విని .
అశ్విని అందాన్ని ఆస్వాదించడంలో పూర్తిగా నిమగ్నమైపోయాడు మణి . ఆమె వయ్యారంగా
నడిచి వెళుతున్నప్పుడు ,ఆమెలోని అండ చందాలు,వంపుసొంపులు,చూపిస్తున్న ,శృంగార
విన్యాసాలు,అతడిని ఒక చోట కుదురుగా,కూర్చోనివ్వడం లేదు . అయినా,అతను ఏమాత్రం
తొందర పడకుండా,ఆమెను పరిశీలనగా చూడడం లోనే నిమగ్నమై వున్నాడు .
డ్రెస్సు మార్చుకుని,రెండు కప్పుల కాఫీతో ,మణిని సమీపించింది అశ్విని . కప్పులోని కాఫీ
పొగలు కక్కుతోంది ,అతని శరీరంలోని వేడి వెయ్యి వోల్టుల కు చేరుకొని,ఏక్షణంలో ఏమి ఆవు
తుందో అన్న టెన్షన్ లో వున్నాడు మణి .
‘’అబ్బా .. !!,ఏంటి బాబూ ,ఆ తీక్షణమైన చూపులు ,ముందు ఆ కాఫీ తాగండి ,చల్లారి పోతుంది ‘’అంది అశ్విని, ముసి మూసి నవ్వులతో మురిపెంగా అతనిలోకి చూస్తూ .
‘’అశ్వినీ …. నో .. నో .. ,నేను ఇప్పుడు కాఫీ తాగే స్థితిలోలేను ,నువ్వు .. నువ్వు కావాలిప్పుడు నాకు ,నిజం!’’అంటూ కాఫీ కప్పులు రెండూ అతనే స్వయంగా టీ -పాయ్ మీద
పెట్టి ,ఆమెను వళ్లోకి లాక్కొని ,గట్టిగా కౌగలించుకున్నాడు ,మణి .
‘’అబ్బబ్బ .. !! కాస్త ఆ గండి,.. మరీ అంత ఖంగారు అయితే ఎలా ?మిమ్మలిని వదిలి నేను
ఎక్కడికీ పారిపోవడం లేదుకదా!’’అంది,,అతని స్పర్శకు మత్తుగా కళ్ళు మూసుకుని .
ఆమె కోరిక ప్రకారం ఇద్దరూ పక్క పక్కన కూర్చొని,కాఫీలు తాగేశారు . ఖాళీ కప్పులు
వంట గదిలో పెట్టి వచ్చింది అశ్విని .
సోఫాలో కూర్చున్న మణి ,బలంగా అశ్వినిని తన ఒళ్ళోకి తీసుకుని మృదువుగా ఆమె అందమైన పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు . అశ్విని ఏమాత్రం ప్రతిఘటించకుండా ,ఆమె
స్పందనలతో అతడికి సహకరించింది . ఇది గమనించిన మణి ,మరింత రెచ్చిపోయాడు . ఆమె
ముఖం నిండా ముద్దులతో గుచ్చేయడం మొదలు పెట్టాడు . ఆ .. క్రమం మెడను ధాటి ఎదను
చేరబోయింది ! అప్పటికే ఆమె కళ్ళు చెప్పలేని తమకంతో,వాలిపోవడం మొదలు పెట్టాయి. ఆమె శరీరం,రకరకాల అనుభవాల కోసం కు త .. కు త .. లాడిపోతోంది . మణి ఆరాటం హద్దులు దాటిపోతోంది . ఇది తట్టుకోలేని అశ్విని ,
‘’డార్లింగ్ .. ఇక్కడేనా .. !!’’అంది మత్తుగా .
6------
‘’మరింకెక్కడ అశ్వినీ ?అన్నాడు ,ఆమె ఎద ఎత్తులమీద మెల్లగా స్పర్శిస్తూ మణి .
‘’ ఛీ .. పో .. సోఫాలో కాదు,బెడ్ రూమ్ లోకి వెళ్దాము ‘’అంది అశ్విని . ఆమె మాటలతో మణి
ఇక ఏమాత్రం ఆలోచించకుండా ,ఆమెను తన రెండు చేతులతోనూ పట్టుకుని,నడిపించడం
మొదలు పెట్టాడు . ఆమె అతడికి బెడ్ రూమ్ లోకి దారి చూపించింది .
అతని ప్రమేయం లేకుండానే,ముందుగానే ఆమె అందంగా అలంకరించిన బెడ్ మీద వాలి పోయింది . ఆమె పయ్యెద ఆమె గుండ్రని ఎద ఎత్తుల్ని కాపాడలేమన్నట్లు,పక్కకు జారిపోయింది . ఆమె చనుద్వయం నిక్కబొడుచుకున్న గోళాల్లా ,ఆమె చోళీ హుక్కులను ఫట
ఫట మనిపించే పరిస్థితికి వచ్చాయి . వాటికి ఆ .. శ్రమను ఇవ్వలేదు మణి !
అశ్వినిని తనవైపు తిప్పుకుని ,గట్టిగా తన గుండెలకు హత్తుకుని ,తేనెలూరిస్తున్న సన్నని ఆమె పెదాల్ని బలంగా చుంభించి, బిగుతుగా వున్నఆమె జాకెట్ హుక్కుల్ని ఆ . హడావిడిలో
తెంచి పారేసాడు మణి . పూర్ణ కుంభాల్లా బయట పడ్డ ఆమె రొమ్ముల కదలికల్ని అదుపు చేస్తూ ,ఆమెను పూర్తిగా ఆక్రమించాడు మణి .
అశ్విని ,అతని చేష్టలకి,చెప్పలేని హాయిని,తీపి అనుభూతిని పొందుతోంది . ఈ అనుభవం కోసం ఇన్నాళ్లు ముఖం వాచిపోయి ఉందామె . నిద్రాణమై ఉన్న శృంగార కోర్కెల సునామీ,
ఆమె లో పొంగిపొర్లుతోంది . దానికి సమానంగా మణి స్పందిస్తున్నాడు . సన్నివేశం పతాక
స్థాయికి చేరుకునే సమయం ఆసన్న మైయింది . ఉన్నట్టుండి ,ఒక్కసారి మణిని పక్కకు తోసేసింది అశ్విని . ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయాడు మణి .
‘’సారీ మ ణీ .. !,ప్లీజ్ .. వద్దు లేవండి ,’’ అంది అశ్విని . మణి ఒక్కింత షాక్ కి గురి అయినట్టు
ఫీల్ అయ్యాడు . నిగ్రహించుకుని లేచి హాల్ లోకి వచ్చాడు .
నిజానికి ,ఇందులో తన పాత్ర అంతంత మాత్రమే !కానీ,తెగువ చూపించి తనను అమితంగా
ఉత్సాహపరిచింది మాత్రం ఆమెనే !మరి,హఠాత్తుగా ,ఆమె అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో అతడికి అర్ధం కాలేదు . అయినా,ఆమె మంచితనాన్ని అతను దుర్వినియోగం చేసు కో దలచుకోలేదు . తక్షణం లేచి బట్టలు సరిజేసుకుని తల దువ్వుకుని బుద్దిగా సోఫాలో కూర్చున్నాడు మణి . ఇంతలో అశ్విని స్నానం చేసి బట్టలు మార్చుకుని , మణి కోసం గ్లాసుడు బత్తాయి రసం తెచ్చి ,తాగమన్నట్టు సైగచేసి అతనిముందు టీ -పాయ్ మీద ఉంచింది .
మణిలో ,కొద్దిగంటల క్రితం అక్కడికి వచ్చిన ప్పుడు ఉన్న హుషారు,సంతోషం ఇప్పుడు లేవు
సరాసరి ఆమె ముఖం లోకి చూడలేని పరిస్థితి ఏర్పడింది మణికి . తల వంచుకుని మెల్లగా జ్యుసి సిప్ చేస్తున్నాడు మణి . అశ్విని కూడా ఇంచుమించు అదే గిల్టీ ఫీలింగ్ లో వుంది . ఊహించని ఈ అనుభవం తనను తాను ప్రశ్నించుకునేలా చేసింది ఆమెను . ఆమె మనసు
7----
పరి .. పరి .. విధాల ఆలోచించడం మొదలు పెట్టింది . ఇద్దరిలోను,చూపులతోపాటు ,మాటలు
కూడా కరువైనాయి . ‘సారి .. అశ్వినీ !’ అందాం అనుకున్నాడు,కానీ మాట పెగిలి బయటకు
రాలేదు .
ఉన్నట్టుండి,అశ్విని నోరు మెదిపింది -------
‘’మణీ .. పనిమనిషి వచ్చే సమయం ఆసన్నమైంది ,మనం ఇక ఇక్కడి నుండి నిష్క్రమించడం
మంచిదేమో !.. ‘’అంది,ఇక నువ్వు బయలుదేరవచ్చు అనే అర్ధంలో .
‘’ ఓ .. అలాగే అశ్విని .. నేను బయలుదేరతాను .. బై .. బై .. ‘’అని బయటికి వచ్చి క్యాబ్ బుక్
చేసుకున్నాడు. పది నిముషాల్లో తన ముందు వున్న క్యాబ్ ఎక్కి ఇంటికి తిరుగు ప్రయాణం
అయ్యాడు ,మణికుమార్ .
** **** *****
ఇంటికి చేరగానే ,భార్య నవ్వుతూ మణికి ఎదురు వచ్చి,పలకరించింది . ఆమె నవ్వుతుంటే తాను గిల్టీగా ఫీల్ అయ్యాడు . అది ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు మణి . ‘ఇంతటి
సౌందర్య వ తిని ,సహ్రద యిని నా,నేను ఇంతగా మోసం చేస్తున్నది !’అని,తనను తాను మనస్సులో తిట్టుకున్నాడు . ఫ్రెష్ అప్ అయ్ ,బెడ్ రూమ్ లో ,డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా కూర్చుని ,తనని తాను కొత్తగా చూసుకుంటున్నాడు మణి .
‘’ఏంటి శ్రీవారు ఈ మధ్య ,అసలు అడ్డం ముందు నుంచి కదలడం లేదు ‘’అని నవ్వుతూ,కాఫీ కప్పు చేతికి ప్రేమగా అందించింది భార్య . నవ్వుతూ .. మెల్లగా కాఫీ సిప్ చేస్తున్న సమయంలో,అతడి మొబైల్ మెసేజ్ వచ్చిన చప్పుడు చేసింది . తాను ఊహించినట్టుగానే,అది
అశ్విని నుంచి . ఆత్రంగా చదవడం మొదలు పెట్టాడు మణి .
‘’డియర్ మణి ,
అయామ్ సో .. సారీ !ఇన్నాళ్ల మన స్నేహం లో అర్ధం కాని అంశాలు కొన్ని ఈ వాళ మనం
ప్రత్యక్షంగా కలుసుకున్నాక తెలిసాయి . జీవితం అంటే ఏమిటో ఒకసారి మళ్ళీ సీరియస్ గా
ఆలోచించాను . నన్ను బంగారం లా చూసుకునే నా భర్తను,నన్ను ఎలాంటి పరిస్థితిలోను కొంచెం కూడా అనుమానించని ఆ .. సహృదయుడిని ,కేవలం నా స్వల్ప ప్రయోజనాలకోసం మోసం చేయలేను . నా సౌఖ్యం కోసం నన్ను దేవతలా పూజించే నా భర్తకు అన్యాయం చేయలేను . అలా చేస్తే ఇంతకు మించిన పాపం మరోటి ఉండదు !అలాగే,మీ వ ల్ల మీ శ్రీమతికి
కూడా,అన్యాయం జరగకూడదన్నది నా అభిప్రాయం . జరిగిన దానికి మిమ్ములను నేను ఎట్టి
పరిస్థితిలోను,భాద్యుడిగా ఎత్తి చూపడం లేదు . మనం స్నేహితులుగానే ఉండిపోదాం . ఇప్పుడు ,ఇంకా ఎక్కువగా రాసి,నేను బాధ పడడమే కాకుండా,మిమ్ములను లేనిపోని వ్యధలకు గురి చేయలేను . అప్పుడప్పుడు చాటింగ్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు . ‘’
ఇదీ ఆ .. మెసేజ్ సారాంశం . మెసేజ్ చదివి ,‘’నువ్వు చెప్పింది అక్షరాలా నిజం అశ్విని . నీ నిజాయితీని అభినందించకుండా ఉండలేక పోతున్నాను . జరిగిందంతా మనమేలుకోసమే సుమా !.. థాంక్యూ .. !!’’అని మనసులో గొణుక్కుని ,కాఫీ కప్పు అందుకున్నాడు మణి .
* సమాప్తం *
--డా.కె.ఎల్.వి.ప్రసాద్,
హన్మ కొండ .
Comments