top of page
  • Writer's pictureకె.ఎల్.వి.

అందుకే .. అలా !! (కథ)

Updated: May 1, 2021

"ఉత్తరాల చరిత్ర ముగిసిపోయిందిరా విశ్వం ‘’అన్నాడు,మిత్రుడు రాజేందర్. 

‘’అలా ఎందుకు అనుకుంటున్నావురా రాజు ?’’అన్నాను ఎప్పటి ధోరణి లోనే. 

రాజేందర్ అనబడే ‘రాజు ‘-నేను,చిన్ననాటి స్నేహితులం. ప్రాధమిక స్థాయి నుండి,డిగ్రీ వరకూ మంచి స్నేహితులుగా చదువుకున్నాం,కలిసి 

తిరిగాం. ఉద్యోగం,పెళ్లి,పిల్లలు వగైరా జీవిత మలుపులతో ఇద్దరం వేరు వేరు చోట్ల జీవితం గడిపినప్పటికీ,పదవీ విరమణ సమయానికి ఇద్దరం 

ఒకే చోట స్థిరపడడం దైవ నిర్ణయమే అనిపిస్తుంది. అదికూడా చారిత్రక 

వరంగల్ పట్టణం కావడం విశేషమే !

రోజూ ఇద్దరం ఒక ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్ణయించుకుని క్రమం 

తప్పకుండా పాటించే వాళ్ళం. ఉదయం లేవగానే మా కార్యక్రమం,కాలకృ

త్యాలు తీర్చుకుని,వాకింగ్ చేయడానికి దగ్గరలోనే వున్నఆర్ట్స్ &సైన్స్ 

కాలేజీకి వెళ్లడంతో ప్రారంభం అవుతుంది. గ్రౌండ్లో ఇద్దరం సరిగ్గా ఉదయం 

5. 30కి గ్రౌండ్ కి చేరుకొని ఒకగంట సేపు నడక -వ్యాయామం వంటి పనులు పూర్తి చేసుకుని అక్కడ వున్నసిమెంట్ బల్ల మీద కాళ్ళూపుకుం

టూ కూర్చోవడం ,ఏవైనా నడక -ఆరోగ్యం గురించిన కబుర్లు చెప్పుకోవడం

నిత్యకృత్యంగా మారింది. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే ఏకాగ్రతతో నడిచినం

త సేపూ ఒకరితో ఒకరం మాట్లాడుకో పోవడం. తర్వాత ఇంటికి వచ్చి కాస్సేపు సేదదీరి శ్రీమతి అందించే వేడి వేడి కాఫీ అందుకుని,కాఫీని ఆస్వాదిస్తూ మరో గంటపాటు లోకాభిరామాయణం లోకి వెళ్లడం నిత్యదిన 

చర్యగా మారిపోయింది. ఇది ఒక రోజు మా ఇంట్లో అయితే మరో రోజు రాజు 

ఇంట్లో ,అవకాశాన్ని బట్టి ఫిక్స్ అయిపోతుంటుంది. రోజూ ఏదో కొత్త అంశం 

చర్చకు తీసుకువస్తాడు రాజు. చర్చ ఒక్కోసారి అంచనాలు దాటి సీరియస్ గా మారి,పట్టాలు తప్పకుండా అది క్రమంగా సామరస్య పూర్వకంగా చల్లారి పోతుంటుంది. మా ముచ్చట్లు విని కొందరు ఇద్దరం కొట్లాడుకుంటు

న్నామేమో అని భ్రమించిన సందర్భాలుకూడా లేకపోలేదు. ఇలా రోజూ సరదాగా కాలక్షేపం అయిపోతుంటుంది. పిల్లలు రెక్కలొచ్చిన పక్షులై వివిధ ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఇంచుమించు ఇప్పుడు ప్రతి ఇంట ఇదే 

పరిస్థితి. 

మా సంభాషణ కొనసాగిస్తూ -

‘’ ఏది .. ఇప్పుడు ఎవరు ఉత్తరాలు రాస్తున్నారు చెప్పు ?అంతెందుకు ,

విద్యార్థి దశలో నువ్వు ఉత్తరాలు ఎలా రాసేవాడివి!అంతేకాదు నీకు రోజూ 

బోలెడు ఉత్తరాలు వస్తుంటే మేమంతా నిన్ను చూసి కుళ్ళుకునేవాళ్ళం కాదా!ఏది మరీ .. ఇప్పుడు నీకు అలా ఉత్తరాలు వస్తున్నాయా?గతంలో 

లా .. నువ్వు ఇప్పుడు ఉత్తరాలు రాస్తున్నావా?’’ అన్నాడు రాజు. 

‘’ నువ్వన్నది నూటికి నూరు పాళ్ళు నిజం రా .. విశ్వమ్ ! అవును ,

అప్పటి రోజులు వేరు,ఆ .. మనుష్యులు వేరు,ఆ మనుష్యుల మనస్సులు వేరు,ఆనాటి ప్రచా రసాధనల పరిస్థితులు వేరు !ఇప్పుడు ఉత్తరాల అవస

రం లేకుండానే సమాచారం క్షణాల్లో అందిపోతోంది,అప్పట్లో అతివేగం అను 

కున్న టెలిగ్రాములకు కాలం చెల్లిపోయింది !ఈనాటి ప్రసార -ప్రచార మాధ్య

మాల హోరులో ఉత్తరాలకు చోటెక్కడ వస్తుంది ?మనిషి కూడా సుఖం మరిగి పోయాడు,ప్రతీది హైటెక్ స్పీడు లో పూర్తి చేయాలనుకుంటాడు,

ప్రాధాన్యతలు కూడా అలా వున్నాయి మరి !

అయినా ఇప్పటికీ నేను ఉత్తరాలు రాయడం పూర్తిగా మానలేదురా విశ్వం 

అడపా దడపా,నేను ఉత్తరాలు రాస్తూనే వున్నాను. తపాలా కార్యాలయా

ల్లో ఇప్పటికీ కార్డులు -కవర్లూ అమ్ముతూనే వున్నారు. లేదంటే నువ్వు 

అన్నట్టు ,గతంలో లా ,నాకు ఉత్తరాలు రాసేవాళ్ళు మాత్రం తక్కువై --

పోయారు ‘’ అన్నాను కాస్త ఆవేదనగా. 

‘’అది కాదురా విశ్వమ్ .. ఉత్తరాలు .. అంటే ,కేవలం క్షేమసమాచారాల

కోసం ,వ్యాపారంకోసం ,మాత్రమే కాదుగా .. కుర్రకారు ప్రేమలేఖలకు ఎంత 

క్రేజ్ ఉండేది !అంతెందుకు,మా చెల్లాయిని బుట్టలో వేసుకోవడానికి నువ్వు 

ఎన్ని ప్రేమ లేఖలు రాసేవాడివని !మొదట్లో నీ ఉత్తరాలు పోస్ట్ చేసేముం--

దు,నన్ను తప్పక చదవ మానేవాడివి. తర్వాత మీ ప్రేమ పాకం ముదిరాక 

నాకు చూపించడం మానేసావనుకో !ఇవన్నీ నేను మరచిపోలేనురా విశ్వం ‘’అన్నాడు. 

‘’ నిజమే,భలే గుర్తు చేసావురా రాజు,ఆ .. రోజులు గుర్తుకు వస్తే,చాలా ఆనందం అనిపిస్తుంది. మొదట్లో నా ఉత్తరాలు చదవడానికి తెగ భయపడి

పోయేది మీ చెల్లాయ్ ,ఆ .. తర్వాత,నా ఉత్తరాలకోసం ఎంత తపించి పోయేదని ,యెంత ఎదురు చూసేదని !ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజుల్లో నేను రాసిన ఉత్తరాలు ఇప్పటికీ దాచుకుందంటే నువ్వు నమ్ముతావా?’’

అన్నాను. 

రాజు ,పక .. పక నవ్వుతూ ---

‘’నిజమేరా విశ్వం ,మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉత్తరాలతోనే ముదిరి పాకాన 

పడింది అప్పుడు. ఆ ఉత్తరాలతో ముడిపడ్డ మీ ప్రేమ ,ఆ తర్వాత పెళ్లి 

గురించి నువ్వు అప్పుడప్పుడూ కథల మాదిరిగా చెబుతుండేవాడివి కదా!’’ అన్నాడు రాజు. 

‘’ అవునురా రాజు,షుమారుగా నూరు ఉత్తరాల చరిత్ర మా ప్రేమాయణం. 

ఆ .. ఉత్తరాలన్నింటినీ,పుస్తకంలా వేయిస్తామని,పిల్లలు అప్పుడప్పుడూ,

వాళ్ళమ్మని ఆటపట్టిస్తుంటారు.’’ అన్నాను. 

                 మా ఇద్దరి కబుర్లతో రోజూ కంటే సమయం కాస్త ఎక్కువ అయింది. మా పరిస్థితి గమనించిన మా ఆవిడ,-తరుణ,బోనస్ గా మరో 

చెరో కప్పు కాఫీ అందించడంతో,ఉత్తరాలు గురించిన చర్చ మరింత రస --

వత్తరంగా సాగుతున్న సమయంలో బయట గేటు దగ్గరనుండి ,

‘’కొరియర్ సార్ .. ‘’ అన్న గొంతు వినవచ్చింది. ఇలాంటి సన్నివేశాల్లో నాకు వినికిడి శక్తి తక్కువని మా ఆవిడ తరుణ బయటికి పరిగెత్తుకు 

వస్తుంది. అతగాడిని లోపలి కి రానివ్వకుండానే తరుణ వెళ్లి సంతకం చేసి 

కవరు తీసుకుని వచ్చింది. 

ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ,ఆ .. రోజు నేను ,రాజు ,దేని గురించి అయితే సుదీర్ఘంగా చర్చిస్తున్నామో,అదే .. ‘ఉత్తరం ‘అమెరికాలో వున్న

అబ్బాయి దగ్గరనుండి వచ్చింది. పైగా అది వాడి నుంచి వచ్చిన మొదటి -

ఉత్తరం !

అబ్బాయి అమెరికా వెళ్లిన తర్వాత ఎం.ఎస్,పూర్తి చేయడం,ఆ తర్వాత ఉద్యోగం రావడం చక .. చక ,జరిగిపోయాయి. రోజుకు రెండుసార్లు ఫోన్లో 

మాట్లాడుకోవడం,వాట్స్ ఆప్ -లో చాట్ చేసుకోవడం తప్ప ఎప్పుడూ 

ఉత్తరం రాసింది లేదు. ఇప్పుడు అలా ఉత్తరం రావడం ఇద్దరికీ ఆనందంతో 

పాటు,ఆశ్చర్యమూ దానికి తోడు ఒక పక్క భయం కూడా మొదలైంది. ఏమో .. ఏమి ఉందొ ఆ .. ఉత్తరంలో అన్నది గట్టిగా పీడించడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో --

‘’ తరుణా .. ఆ ఉత్తరం ఓపెన్ చేసి చదువు ,అబ్బాయి యేమి రాసాడో 

చూద్దాం’’అన్నాను,నాలోనిఆందోళన బయటికి కనిపించే కుండా.

‘’ ఆమ్మో..అందులోఏముందో ఏమో ..నేను చదవను బాబూ..మీరే 

ఓపెన్ చేసి చదవండి మీకు పుణ్యం ఉంటుంది’’ అంది తరుణ.

‘’ ఒరేయ్..విశ్వం,ఇప్పటికే కాలాతీతమయింది,ఇకనేను వెళతాను మరి!

సావధానంగా కూర్చుని,ఇద్దరూ కలసి ఉత్తరం చదవండి.మంచివిషయాలే 

ఉంటాయి,అవేమిటో తర్వాత నాచెవిన పడేయండి’’ అనిలేవడానికి ఉపక్రమించాడు రాజు.

‘’ఒరేయ్..రాజూ,ఇంకాస్సేపు ఉండరా నీకు పుణ్యం ఉంటుంది.అలాగే ఉత్త-

రం లో ఏముందో,తెలుసుకుని పోవచ్చు,నువ్వేమీ నాకు పరాయివాడివి కాదు కదా!’’అన్నాను.

‘’ అది కాదులే గానీ,మీ చెల్లాయ్ అక్కడ అన్న-పానీయాలు,మాని నా కోసం,ఎదురు చూస్తుంటుంది,ఆలస్యం అయింది కాబట్టి,ఆమె ఖంగారు పడే అవకాశం కూడా లేకపోలేదు.’’ అంటూ,లేచి తన ఇంటి వైపు బయలు దేరాడు రాజు.


*            *            *            *           *               *


‘’ ఏవండీ..ఉత్తరం ఓపెన్ చేశాను,మీరు చదవండి ప్లీజ్!’’ అంది,ఆతృతగా

తరుణ.

‘’ అబ్బా..నువ్వు చదవవొయ్,ఎవరు చదివితే ఏముంది,రాసింది మన అబ్బాయే కదా!’’ అన్నాను.

‘’ ఆమ్మో..అది నావల్ల కాదుబాబూ..! ఎందుకో నాకు భయంగా ఉందండీ,

వాడు ఎన్నడూ ఉత్తరాలు రాయనివాడు,ప్రత్యేకంగా ఉత్తరం రాసాడంటే , వాడు మనకు మామూలుగా చెప్పలేనిదేదో,ఉత్తరం ద్వారా చెప్పి ఉంటా--

దండీ ,’’ అంది తరుణ.

‘’ త రూ..నీకు అన్నీ అనుమానాలే!ప్రతి దానికీ ఏదో చరిత్ర అంటగడతావ్,

ఏదీ..ఆ ఉత్తరం ఇలా ఇవ్వు’’ అని ,ఉత్తరం చేతిలోనికి తీసుకుని చదవడం 

మొదలు పెట్టాను. 


‘’ ప్రియమైన మమ్మీ -డాడీ లకు ,క్షమించాలి మీకు అలా పిలిపించుకోడం 

ఇష్టం ఉండదు కదూ !

ప్రియమైన అమ్మ,నాన్నలకు ,

ఉభయ కుశలోపరి,మీరు ఇలా నా దగ్గరనుండి ఉత్తరం ఊహించి వుండరు 

కదూ !ఇది చూసి మీరు తప్పక ఆశ్చర్యపోతారని నాకు బాగా తెలుసు !

ఎందుకంటే,నేను పుట్టిపెరిగిన తర్వాత మీకు ఎప్పుడూ ఉత్తరం రాయలే--

దు. పైగా రాయవలసిన అవసరం కూడా ఎప్పుడూ రాలేదు. నేను ఎదిగి 

ఉత్తరాలు రాసె వయసు వచ్చేసరికి అందరిలానే మా చేతుల్లోకి మొబైల్ 

ఫోన్స్ వచ్చేసాయి,ఆ .. తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. వీటితోపాటు 

లేప్ టాప్ లు,ట్యాబ్ లు ,రంగప్రవేశం చేశాయి. తద్వారా ఉత్తరాల అవసరం క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. 

అయితే ఇప్పుడుకూడా ఉత్తరం రాయవలసినంత తప్పని సరి కాకపోయి

నా,కొన్ని విషయాలు సరిగా అర్ధం కాకపోతే అవి మనః స్పర్ధలవైపు తప్పుడు సంకేతాలు తీసుకుపోతాయి. ఆ రకంగా మీకు నేను దూరం కాలేను! ఇప్పటికే మీనుండి కొన్ని వేల మైళ్ళ దూరం వచ్చేసాను. నా పట్ల మీ మనస్సుల్లో దూరంపెరిగితే అది నేను భరించలేను !అది ఊహించడానికే ఇబ్బందిగా ఉంటుంది. 

అందుకే అన్ని విషయాలు పూసగుచ్చినట్టు మీ ముందుంచాలని ఈ 

ఉత్తరం రాస్తున్నాను. నిజానికి ఇప్పటికే ఈ ఉత్తరం మీకు రాసి వుండాలి--

సింది. అయితే ,రాయాలా ?వద్దా ?అనే సంశయం నన్ను ఇన్నాళ్లూ ఉత్తరం రాయకుండా చేసింది. 

అయితే,ఇక ఎంతమాత్రమూ ఆలస్యం చేయకూడదని నా మనస్సు పదే -

పదే గద్దించడం తో,ఇప్పుడు రాసేసాను. ఇందులో మిమ్ములను ఇబ్బంది 

పెట్టె విషయాలు ఏమీ లేవు,కానీ ,ఇక్కడి జీవితాన్ని నేను ఎందుకు ఎన్ను కున్నానన్న విషయం మీకు స్పష్టం చేయవలసిన అవసరం,బాధ్య

త ,నాకున్నాయి. అందుకే ఈ ప్రయత్నం. 

డాడీ .. !నేను ఇలా అమెరికా రావడం మీకు ఇష్టం ఉండదనీ,ఇప్పటికీ మీకు ఇష్టంలేదని నాకు ముందే తెలుసు. చెల్లీ ,నేనూ ఏదో ఉద్యోగం చేసు 

కుంటూ మీ కళ్లయెదుట,ఎప్పటికీ పిల్లా పాపలతో సందడిగా ఉండాలన్నది 

మీ కోరిక !అందుకే  నా అమెరికా ప్రయాణ ప్రయత్నాలు,వాటి వివరాలు మీకు ఎప్పటికప్పుడు అందించలేకపోయాను. నేను అమెరికా రావడం అనే కంటే ,మీ దగ్గర ఉండకుండా నేను దూరంగా వచ్చేసినందుకే మీరు బాధ పడతారని నాకు తెలుసు. ఈ వయసులో మీ మనసేమిటో,మీ ఆలో

చనలు,అభిప్రాయాలూ,అభిరుచులు ఏమిటో నేను అర్ధం చేసుకోగలను 

చిన్నప్పటి నుండి మీరు చెల్లినీ ,నన్నూ ఎలా పెంచారో,ఎలాంటి క్రమ --

శిక్షణ మాకు అలవాటు చేసారో,మీ క్రమశిక్షణ ను ,మేము ఎలా అపార్ధం 

చేసుకున్నామో,అన్నీ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. 

ఇన్ని తెలిసికూడా మీ ఇద్దరికీ దూరంగా వెళ్ళడానికి నేను ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానో మీకు తెలియాలి. మీకు దూరంగా ఉండడం నాకు కూడా అంత ఇష్టమైన పని కాదు. దీన్ని అతిగా ఆలోచిస్తే గుండె 

చెరువై పోతుంది . కానీ,నన్ను నన్నుగా ,నా సామర్ధ్యం నిరూపించుకో--

దానికి,నా అభిరుచి మేరకు నా జీవితాన్ని,జీవిత విధానాన్ని తీర్చి దిద్దు 

కోవడానికి ఈ నిర్ణయం తీసుకోక చెప్పలేదు. 

డాడీ .. విద్యాకాలాన్నీ ,ఉద్యోగ కాలాన్నీ,ఎలా నెట్టుకొచ్చారో మీరు నాకు 

తెలీదు కానీ,నాకు తెలిసినప్పటినుంచీ సమాజంలో ప్రజల్ని విభజించి చూడడం ,విభజించి మాట్లాడడం,ప్రతి విషయంలోనూ,కులం ,మతం,

ప్రాంతం,తో ముడిపెట్టి విడగొట్టి మాట్లాడడం,కించ పరచి మాట్లాడడం,

యెంత విజ్ఞాన వంతుడైనా ,ప్రతిభా మూర్తి అయినా,కులాన్ని బట్టి తక్కువ చేసి మాట్లాడడం ,వంటి విషయాలను తట్టుకోలేకపోయాను,నా 

కులాన్ని నిరూపించుకోడానికి ఎన్నెన్ని ప్రశ్నలు ఎదుర్కోవాలి నేను ?

ఎన్నెన్ని ఆటంకాలు దాటుకుని రావాలి నేను ?నేను ఫలానా కులం వాడినని ద్రువీకరించడానికి గ్రామా స్థాయినుండి మండల స్థాయివరకూ 

అవసరం అయితే జిల్లా స్థాయి వరకూ ముడుపులు చెల్లించాలా ?పేద వాడిని .. పేదవాడు అని చెప్పడానికి ,పేదవాడి దగ్గర లంచం ఆశించడం 

యెంత వరకు సబబు ?

రాజ్యాంగ బద్దంగా కేటాయించబడిన ఉద్యోగాల్లో స్థానం పొందితే మరోక

వర్గం ఎగతాళీ చేయవలసిన అవసరం ఉందా ?విద్యాధికుడు,విద్య విహీనుడు ప్రతి కులంలోనూ,ప్రతి మతంలోనూ,ప్రతి ప్రాంతంలోనూ లేరా?

ఎందుకు ఫలానా వర్గాన్ని ప్రత్యేకంగా ఎత్తి చూపుతారు ?ఇలాంటి ప్రశ్నలు 

అన్నింటికీ ఒకే సమాధానం దొరికింది. మాతృ భూమికి సేవ చేయలేక---

పోతున్నానన్న బాధ,తల్లిదండ్రులకు ,బంధువర్గానికీ దూరమైపోతున్నా--

నన్న వ్యధ తప్ప,అమెరికాలో నా స్వయం కృషితో ఉన్నతమైన ఉద్యోగం 

సంపాదించుకున్నాను. ఓపిక ఉన్నన్నాళ్ళు కష్ట పడతాను,అవసరమైతే 

తిరిగి వచ్చి మీతో కలిసి జీవిస్తాను. ఇక్కడ కులం వివక్షత ఉండదు,మతం తో పనిలేదు,ప్రాంతం అడ్డు రాదు (సమస్యలు ఉత్పన్నం కానంత వరకూ)

ఇప్పుడు మీ సుపుత్రుడు కష్ట జీవి,తన స్థాయిలో తాను జీవితాన్ని ఆనంద మయం చేసుకున్న స్వేచ్చాజీవి. ఇప్పుడు చెప్పండి నా నిర్ణయంలో తప్పు ఉందా ? అందుకే … అలా .. !!

                                                            ప్రేమతో 

                                                         మీ .. ప్రియ పుత్రుడు 

                                                              రాము. ‘’

అప్పటికే తరుణ కళ్ళు కన్నీటి చెలామలయ్యాయి. నా నోటి నుండి అతి 

కష్టంగా ----

‘’ చూసావా తరూ … మన అబ్బాయి యెంత పెద్దవాడు అయిపోయాడో ,

సమాజాన్ని యెంత లోతుగా వీక్షించాడో చూసావా ?మనం ధైర్యంగా ఉండాలి,అబ్బాయి విషయంలో ఇక బెంగ పడాల్సిన అవసరం లేదు,వాడు 

ఏదైనా కరెక్టుగానే ఆలోచిస్తాడు ‘’ అన్నాను. 

‘’ అవునండీ .. అబ్బాయి ఏమి చేసినా ఆలోచించే చేస్తాడు ‘’అంటూ అయస్కాంతంలా నన్ను అతుక్కుపోయింది తరుణ . 


                        *సమాప్తం *



డా.కె.ఎల్.వి.ప్రసాద్

హనంకొండ.


1 view0 comments

Recent Posts

See All

పరిష్కారం ..!! ( పిల్లల కథ )

శేఖర్ బా బు ... చాల బొద్దుగా అందంగా ఉంటాడు.పెళ్లిఅయిన పది సంవత్సరాలకు ,ఆనంద్ -శ్రీలేఖలకు పుట్టిన విలువైన సంతా నం ,శేఖర్ బాబు .తల్లిదండ్రులకు గారాల బిడ్డ .ఇంట్లోఅందరికీ అతడొక జీవమున్న ఆటవస్తువు అయిపోయా

అపరిచితుడు ..!! (కథ)

మధ్యాహ్నం 11గం. లు ,అయి ఉంటుంది. ఔట్ పేషేంట్ డిపార్ట్మెంట్ లో ,పేషేంట్స్ ను చూడ్డం పూర్తి కావడంతో,బ్రీఫ్ కేస్ లోఉన్న వారపత్రిక తీశాను,ఓసారి శీర్షికలు చూద్దామని.నిజానికి అంత సమయం రోజూ దొరకదు,కానీ ఆ రోజ

   తిక -మక !! (చిన్న -హాస్య కథ)

కరోనా కాలం ఇది . అయినా ,అక్కడ జనసందోహం బాగానే వుంది . కొందరు సగం మూతికి మాస్కు పెట్టుకుంటే ,కొందరు మాస్కును మేడలో వెళ్లాడ దీసుకున్నారు మూర్ఛ రోగుల్లా . అక్కడ ఎవరూ స్థిమితంగా ఒకే చోట కూర్చోలేక పోతున్నా

Post: Blog2 Post
bottom of page