పిల్లల్లారా ...
పాపల్లారా ...
రేపటి విద్యార్థుల్లారా ,
సాహిత్య -సాంసృతిక
రంగాలలో ....
పాలుపంచుకునే ..
రేపటి ...
సాహిత్య కారుల్లారా
కాబోయే ...
గొప్ప కళాకారుల్లారా !
ఆటాపాటా మాత్రమే కాదు ,
చదువులోనూ
చేతిపనుల్లోనూ
వివిద రకాల కళల్లోనూ
ఎ ప్పుడూ ముందుండాలి !
బడిపుస్తకాలు మాత్రమే కాదు ,
పిల్లల కథలు
చిట్టిపొట్టి కథలు
మహాత్ముల జీవిత చరిత్రలు
నదుల ఉనికి
జంతువుల జీవన కథనాలు
అన్నీ శ్రద్దగా చదవాలి !
వ్యాసరచనలో .....
వక్తృత్వం లో ....
చిత్ర రచనలో
విచిత్ర వేష ధారణలో
ఉత్సాహం చూపించాలి
ఉన్నత శిఖరాలకు
ఎదగాలి ....!
అత్యున్నత స్థానానికి
పెరగాలి ....!!
------డా .కె .ఎల్ .వి.ప్రసాద్ ,
హన్మకొండ .
Commentaires