top of page

అందినఆనందం...!! (బాల గేయం)

Writer: కె.ఎల్.వి.కె.ఎల్.వి.

బొమ్మలు ..బొమ్మలు

భలే ..భలే ..బొమ్మలు

అందమైన బొమ్మలు

ఆడుకునే బొమ్మలు

అమ్మకొన్న బొమ్మలు

అమెజాన్ బొమ్మలు

పుట్టిన రోజున

పెద్దలిచ్చిన -

గిఫ్టు---బొమ్మలు ....!

అమ్మకు చిన్నపుడు

అసలు లేవట బొమ్మలు ,

మామకూడా -అమ్మలానే

బొమ్మలతో ఆడలేదట

తాత --అమ్మమ్మ

బొమ్మలేమీ కొనలేదట !

అమ్మకు వీలుకాని

సరదాలెన్నో ...

నా ద్వారా తీర్చుకుంది ,

నాకెన్నో బొమ్మలు కొనిచ్చి

ఆడుకోమంటుంది హాయిగ !

అమ్మా ...నీకు వందనం ,

బొమ్మలతో ఆడుకుని

అందిస్తా నీకు ఆనందం ...!!



-------డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,

హన్మకొండ .

Recent Posts

See All

సందేశం ....!! (బాల గేయం)

పిల్లల్లారా ... పాపల్లారా ... రేపటి విద్యార్థుల్లారా , సాహిత్య -సాంసృతిక రంగాలలో .... పాలుపంచుకునే .. రేపటి ... సాహిత్య కారుల్లారా...

Comments


Post: Blog2 Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook

*గమనిక* 
ఈ..సాహిత్య సంపద నా స్వంతం. ఇతరులు ఎవరూ, ఏ అంశాన్ని నా అనుమతి లేకుండా  ఏ విధంగా ను ఉపయోగించ రాదు.అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 
 -----డాక్టర్. కె.ఎల్. వి.ప్రసాద్. రచయిత.

Copyright ©2021 klvsahityam by KLV Prasad. All rights reserved

bottom of page