top of page
  • Writer's pictureకె.ఎల్.వి.

అద్దం చెప్పని అందం ..!!   (గల్పిక )

రాధా కృష్ణ ఆలోచనలో పడ్డాడు . ఎన్ని రోజులనుంచో మెదడును తొలిచేస్తున్న విషయం . ఎంత వద్దనుకున్నా ,అతడి మనసు అదేవిషయాన్ని పదేపదే గుర్తుచేస్తోంది అతడికి . తనను తాను సమర్ధించుకోలేని విషయం

అలా అని ,మామూలుగా తోసిపుచ్చే విషయమూ కాదు . ఆ .. తర్జన భర్జన లోనే ,అతని మనసు మనసులో ఉండడం లేదు ,ఈ మధ్య .అసలు తాను అంత అందంగా ఉంటాడా ?తనలో అంత ఆకర్షణ శక్తి ఉందా?అతని మీద అతనికే నమ్మకం లేని పరిస్థితి . అసలు తను ఈ మధ్య ఇలా ఎందుకు తయారవుతున్నట్టు ?తన అంతులేని ఈ ఆలోచనలకు అర్ధం ఏమిటీ. కృష్ణ  మనసు పరిపరివిధాల,ఆలోచనల్లో పడింది ఇదొక సమస్యగా తయారయింది అతనికి . ఇదేదో చెప్పుకోలేని జబ్బులా అనిపించింది అతనికి. , ఏపని మీద శ్రద్ధ చూపించలేని ,నిరుత్సాహం అతనిలో చోటు చేసు కుంది .  పోలంపనుల మీద కూడా శ్రద్ధ తగ్గింది . దానివల్ల ఇంట్లోకూడా ,అతను తిట్లు తినాల్సి వస్తున్నది . ఎటూ తోచని పరిస్థితి ,ఏమీ చేయ లేని దురదృష్టం అతనిది . ఎందుకో తనని తానూ తక్కువ చేసుకుని ఆలోచిస్తున్నాడు రాధాకృష్ణ . 


రాధాకృష్ణ కి అద్దం అంటే చెప్పలేని భయం . అద్దం నిజాన్ని దాచివుంచలేదు కదా !అందుకే అతనికి అద్ధం చూడాలంటే భయం !అయినా ఓసారి అద్దం చూడాలనుకున్నాడు . అద్దం లో చూస్తుంటే తన రూపం తనకే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది . మరి ఆ .. అమ్మాయి తనని రోజూ అదేపనిగా అలా ఎందుకు చూస్తున్నట్టు ?ఆమెకు తనలో ఆకర్షించే గొప్పతనం ఏముంది ?ఇంటి ఎదురు ఇల్లైనా ఇప్పటివరకూ ఆమెతో మాట్లాడే అవకాశం ,సందర్భం రాలేదు . మరి రోజూ తనని చూసి కళ్ళతో ఎందుకు పలకరిస్తున్నట్టు ?ఎందుకు అలా చిరునవ్వు నవ్వి తనలో అంచనాలకు మించిన అంతుపట్టని జ్వాలలు రగిలిస్తున్నట్టు ?అలోచించి .. అలోచించి అతనిలో ఒకోసారి నీరసం ముంచుకొస్తుంది . పైగా ఇది ఎవరికీ చెప్పుకునే విషయం కాదు . ఎవరకు తెలిసినా ,’ ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసు కున్నావా ?’ అనడం ఖాయం . ఎందుకంటే ,ఎదురింటి అమ్మాయి అందం అలాంటిది . ఆమె అందంతో పోల్చి చూస్తే ,కృష్ణ ఆమె పక్కన ఒక్క నిమిషంకూడా నిలబడే అర్హత లేని వాడు . అది అతనికి కూడా తెలుసు . మరి ఆ .. అమ్మాయి పదే .. పదే  తనని అలా ..ఎందుకు  కవ్విస్తున్నట్టు ?రాధా కృష్ణకి అసలు అర్ధం కావడం లేదు . ఈ మధ్య అతికష్టం మీద ఆమె పేరు కనుక్కోగలిగాడు . సౌందర్య అట !ఎంత మంచిపేరు ఆమెది . పేరుకు తగ్గట్టే ఆమె గొప్ప సౌందర్య వతి . ప్రతి మగాడిని కూడా యిట్టె ఆకర్షించగల అతిలోక సుందరి ఆమె !తెలిసికూడా తాను ఎందుకు ఆమె గురించి అతిగా ఆలోచిస్తున్నట్టు


ఒకోసారి ఆ .. విషయం జోలికి ఇకపోకూడదని ,ఆమెని చూడకూడదని అను కుంటాడు రాధా కృష్ణ . కానీ అతనికి అది సాధ్యం కావడం లేదు . ఆమెను చూడకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది . తనని తాను నియంత్రించు కోవడానికి ప్రయత్నం చేసినా ,ఆమెను కనపడొద్దని చెప్పే ధైర్యం ఎక్కడిది ?’ నీకు ,ఆ .. హక్కు ఎవరిచ్చార’ ని ఆమె ఎదురు ప్రశ్న వేస్తే ? దీనికి ఎలాగైనా ఒక ముగింపు తీసుకురావాలని ,ఆమె మనసులోని ఆంతర్యం ఏమిటో కూడా తెలుసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాడు రాధాకృష్ణ . ఉబుసుపోక ఆ .. రోజు పొలంవైపు వెళ్ళాడు రాధాకృష్ణ . నిజానికి ఆతను పొలం ముఖం చూడక చాలారోజులైంది . ఆలోచనలను మళ్లించడానికి పొలం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు . అయితే , అతనికంటే ముందే సౌందర్య పనిమీద పొలం వెళ్లినట్టు తెలీదు . ఆమెకూడా ఆసమయంలో అక్కడ అలా రాధాకృష్ణను ఊహించలేదు . యాదృశ్చికంగా ఒకరికొకరు ఎదురు పడ్డారు . దగ్గరగా ఒకరినొకరు చూసుకున్నారు . ఆమె నవ్వింది ,

అనుకోకుండా అతనూ నవ్వాడు . ‘’ రోజూ నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు ?’’ అన్నట్టుగా ,కళ్ళతో 

ప్రశ్నించాడు ,రాధా కృష్ణ . జంకు -గొంకు లేని సౌందర్య ,మరింతగా నవ్వుతూ ,నిర్భయంగా రాధాకృష్ణ ,బుగ్గను సున్నితంగా తాకి ,’’నీలో నేను చూస్తున్నది నీ మంచి మనసే అన్నయ్యా .. !’’ అంది . ఒక్కసారి తెల్లముఖం వేసాడు రాధాకృష్ణ . ఇప్పటివరకు తాను ఆలోచించిన ఆలోచనలకు ,తనమీద తనకే అసహ్యం వేసింది . అవేమీ అతని ముఖంలో కనపడకుండా నిండు మనసుతో ,‘’ సంతోషం ,వెళ్ళు చెల్లమ్మా .. ‘’ అని ,పక్కకి జరిగాడు రాధాకృష్ణ . ‘’ బై .. అన్నయ్యా .. ‘’అని నవ్వుకుంటూ నిష్కల్మషంగా  ,తనదారిన తాను ముందుకు సాగిపోయింది సౌందర్య . 



డా.కె.ఎల్.వి.ప్రసాద్

హనంకొండ

2 views0 comments

Recent Posts

See All

అవ్వ మనసు (గల్పిక)

రామకృష్ణాకాలనీ హన్మకొండ.* వర్షాకాలమే ,అయినా వర్షాలు లేవు . మేఘము -మెరుపులు జతకట్టి ఉరుముల చప్పుడుకి ,వర్షించడం మాని ,ఆకాశంలో తేలిపోయాయి .ఇం ట్లో ,ఫ్యాన్ తిరుగుతున్నా ,ఉక్కబోత ఎక్కువై ,బయటకు వచ్చి ,వరం

చిన్టూ గాడి చమక్కు (గల్పిక)

జోగం జీవితం అంటే ఏమిటో చిన్నతనం లోనే చవిచూచాడు. అనుకోకుండా అతనికి ఆ అవకాశం ఎదురొచ్చినట్లైంది . నిజానికి జోగం అసలు పేరు అదికా దు . చిన్నప్పుడే మేనమామ దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోయాడు జోగం . మేనమామ పిల్ల

Post: Blog2 Post
bottom of page