మిత్రులు డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ గారు ఎంతో ప్రేమగా పంపించిన 'చిలకపలుకులు' ఇప్పుడే అందుకు న్నాను. ధన్యవాదాలు ప్రసాద్ గారు. తన మనవరాలి పై ప్రేమతో రాసిన కవితలను పుస్తకం గా తీసుకువచ్చారు. టీవీ లకు, సెల్ ఫోన్లకు అఃకితమై పోతున్న పిల్లలు తెలుగుభాషకు తెలుగు పదాలకు దూరమైపోతున్నారు. ఈ నేపధ్యంలో పిల్లలకోసం చిన్న పదాలలో ఎంతో అర్ధవంతమైన భావాలని దిట్టించి మన కందించారు.పిల్లలు ఏ వస్తువునైనా ఎందుకు ఇష్టపడతారు. మనం ఇష్టం గా వాటిని చూసుకుంటే పిల్లలు కూడా వాటిని ప్రేమిస్తారు. ఇందుకు ఉదాహరణే మనవరాలకు రేడియో అంటే ఇష్టం ఎందుకంటే తాతకు ఇష్టంకాబట్టి అని కవితలో చెబుతారు. నిజమే కదా నేటి పిల్లలు రేడియో అంటే ఏమిటి అని అడిగే రోజులివి. ఆ మనవరాలకి రేడియో అంటే ఎందుకు ఇష్టముండదు. వాళ్ళది రేడియో కుటుంబంకదా...ఆ మనవరాలి పెదతాతయ్య , అమ్మ రేడియో కు ఊపిరి లూదినవారేకదా..అందుకే ఆ అమ్మాయి క్కూడా రేడియో అంటే ప్రేమన్న మాట.
బంధాలు అనుబంధాలు పిల్లలకు అర్ధమయ్యే రకంగా మనవరాలి పుట్టినరోజు కానుకగా బుల్లి బుల్లి పదాలతో కవితలు రాసి ఆ కవితలకు ఆ మనవరాలి ఫొటోలను జోడించి ఒక పుస్తకంగాచేసి బహుమతిగా ఇచ్చారు. బహుశా కొన్ని తరాలు నిలచిపోయే బహుమానం ఇదికదా...
సరసి వేసిన ముఖచిత్రం ఇట్టే ఆకర్షిస్తే ప్రసాద్ గారు వేసిన అక్షర చిత్రాలు మనల్ని కట్టిపడేస్తాయి.
చిలకపలకులు పిల్లలందరిచేత చదివించాలి.అందరూ చదవాలని ఆశిస్తూ...ప్రసాద్ గారి కలం నుంచి మరెన్నో కవితలు పిల్లలకోసం రావాలని కోరుకుంటూ....
----బాపూజీ (సమీక్షకులు)
హైదరాబాద్.
Comments